
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ సంపాదించుకుంటున్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒక్కరు. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కానీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. మెగా హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఇటీవలే ఓ స్పెషల్ పాటతో రచ్చ చేసింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కేతిక శర్మ. ప్రస్తుతం మోడ్రన్ గ్లామర్ ఫోజులతో నెట్టింట హీటెక్కిస్తుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరక ఒక్క హిట్టు రాలేదు. కానీ వరుస అవకాశాలు అందుకుంటూ ఫాలోయింగ్ మాత్రం పెంచుకుంది.

కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ పూరి తనయుడు ఆకాష్ పూరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినా కేతికకు మాత్రం ఆఫర్స్ వచ్చాయి.

ఆ తర్వాత రంగ రంగ వైభవంగా, బ్రో, లక్ష్య చిత్రాల్లో మెరిసింది. కానీ ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో రచ్చ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.

తాజాగా కేతిక శర్మ క్రేజీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. స్పెషల్ పాటతో నెట్టింట రచ్చ చేసిన ఈ చిన్నది ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట మాత్రం సందడి చేస్తుంది.