Bhumika : 47 ఏళ్ల వయసులో అంతే అందం.. 365 రోజులు అవే తింటాను.. డైట్ ప్లాన్ రివీల్ చేసిన భూమిక..

Updated on: May 08, 2026 | 12:25 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో చాలా తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె.. కోట్లాది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది భూమిక. ఈ క్రమంలోనే తాజాగా తన ఫిట్నెస్, డైట్ ప్లాన్ రివీల్ చేసింది భూమిక.

1 / 5
తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. తనదైన ముద్ర వేసిన హీరోయిన్ భూమికా చావ్లా.  'ఖుషీ' సినిమాతో సుపరిచితురాలైన ఈ అమ్మడు 2000లో 'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఖుషీ, ఒక్కడు, సింహాద్రి, మిస్సమ్మ, వాసు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. 'మిస్సమ్మ' (2003) చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియా సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

2 / 5
అయితే యుఫోరియా సినిమా ప్రమోషన్ల సమయంలో ఓ ఇంటర్వ్యూలో భూమిక మాట్లాడుతూ తన డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. 47 ఏళ్ల వయసులో అంత అందంగా ఉన్నందుకు గల కారణాలు తెలిపింది. తాను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతానని.. తాను పూర్తి శాఖాహారి అని వెల్లడించారు. తన ఆహారంలో మసాలాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. ఖరీదైన లేదా కఠినమైన డైట్ ప్లాన్‌లు ఏవీ అనుసరించనని అన్నారు. ఏదైనా తిన్నా కూడా అది 'మితంగా' ఉండేలా చూసుకుంటానని అన్నారు.

3 / 5
తనకు ఇష్టమైన ఆహారం కూడా ఇంటి వద్ద తయారు చేసిన సాధారణ శాఖాహార భోజనమే తీసుకుంటానని అన్నారు. ముఖ్యంగా వ్యాయమాలు, యోగ చేయడం అసలు మర్చిపోనని అన్నారు. మానసిక, శారీరక ప్రశాంతత కోసం యోగా చేస్తానని అన్నారు. నిత్యం వాకింగ్ చేయడం తనకు అలవాటని అన్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చర్మం ఇప్పటికీ ఎంతో కాంతివంతంగా ఉండటానికి ప్రధాన కారణం జీవనశైలి అని చెప్పారు.

4 / 5
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలని.. అలాగే ఎక్కువగా నీరు తాగడం, తాడా పండ్లు తీసుకోవడం.. సరైన నిద్ర చర్మ సౌందర్యానికి అత్యంత ముఖ్యమని ఆమె వివరించారు. నిద్ర విషయంలో చాలా కచ్చితంగా ఉంటానని రాత్రి 10:30 లేదా 10:45 కల్లా నిద్రపోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సరైన విశ్రాంతి లేకపోతే చిరాకు కలుగుతుందని, అందుకే తగినంత నిద్ర పోవాలని చెప్పారు. ప్రయాణాలు చేయడం, పుస్తకాలు చదవడం వంటివి ఆమెకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు.

5 / 5
హీరోయిన్‌గా అగ్రస్థానంలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్న భూమిక, కొంత విరామం తర్వాత సహాయ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 'MCA' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో వదిన పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల వచ్చిన 'సీతారామం' , 'బటర్ ఫ్లై' వంటి చిత్రాల్లో కూడా ఆమె కీలక పాత్రలు పోషించారు. ఇటీవల యుఫోరియా చిత్రంలో నటించారు. ఇందులో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. ఇప్పుడిప్పుడే తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తే నటించడానికి రెడీగా ఉన్నట్లు వెల్లడించారు భూమిక.

Follow Us