అబ్బో.. మనోడు మామూలోడు కాదుగా..! అనిరుద్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Updated on: Oct 19, 2026 | 12:35 PM

ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న పేరు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా టాలీవుడ్, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్దే. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఓపెన్ చేసినా అనిరుధ్ గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానంగా రెండు పెద్ద కారణాలున్నాయి.

1 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న పేరు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా టాలీవుడ్, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్దే. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఓపెన్ చేసినా అనిరుధ్ గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానంగా రెండు పెద్ద కారణాలున్నాయి. అవేంటంటే.. రీసెంట్‌గా అద్భుతమైన మ్యూజిక్‌తో అదరగొట్టిన 'జైలర్-2' సినిమా ఫీవర్, మరొకటి ఆయన పెళ్లి వార్తలు! ఈ రెండు అంశాలతో ప్రస్తుతం ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. 'జైలర్-2' చిత్రంలోని ఎక్సెప్షనల్ మ్యూజిక్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేసిన అనిరుధ్.. ఆ ఫీవర్ నుండి బయటకు రాకముందే ఆయన పెళ్లి వార్త పెద్ద సంచలనంగా మారింది. సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్ను అనిరుధ్ వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

2 / 5
 వీరిద్దరి వివాహం గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనుండగా, నవంబర్ 21న చెన్నైలో అట్టహాసంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.  ఇప్పటికే కళానిధి మారన్ దంపతులు స్వయంగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను కలిసి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అందజేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ ఆస్తుల విలువ అక్షరాల రూ. 26,000 కోట్లుగా ఉంది. ఈ భారీ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలైన కావ్య మారన్‌ను అనిరుధ్ పెళ్లి చేసుకోనుండటంతో.. బక్కోడు నిజంగానే వేల కోట్లకు అధిపతి అయ్యాడు, జాక్‌పాట్ కొట్టేశాడు అంటూ నెటిజన్లు సరదాగా పోస్ట్‌లు పెడుతున్నారు.

3 / 5
పెళ్లి వార్తలు ఒకవైపు జోరుగా సాగుతుంటే, మరోవైపు అనిరుధ్ గత లవ్ అఫైర్స్, గర్ల్ ఫ్రెండ్స్‌ గురించిన చర్చలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇతని ప్రేమ ప్రయాణంలో ఇప్పటివరకు వినిపించిన పేర్లు ఇవే.. ఆండ్రియా: అనిరుధ్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు టాలెంటెడ్ హీరోయిన్ ఆండ్రియా. వీరిద్దరూ దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అనిరుధ్ కంటే ఆండ్రియా ఆరేళ్లు పెద్దది కావడం గమనాభం. వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు, ముద్దుల తాలుకూ పిక్స్ ఇంటర్‌నెట్‌లో లీక్ కావడంతో ఆ సమయంలో పెద్ద సంచలనమే రేగింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇద్దరూ విడిపోయారు. ప్రియా ఆనంద్ : 'లీడర్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియా ఆనంద్‌తోనూ అనిరుధ్ డేటింగ్ చేస్తున్నట్లు ఒక దశలో వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌ను ఇద్దరూ ఖండించారు. తాము కేవలం మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.

4 / 5
శృతిహాసన్ ,  కీర్తి సురేష్: '3' సినిమా తర్వాత శృతిహాసన్‌తో అనిరుధ్ ప్రేమలో ఉన్నాడంటూ కోలీవుడ్ కోడై కూసింది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తోనూ ఆయన పేరు ముడిపడింది. అయితే కీర్తి తాను అనిరుధ్‌కి మంచి క్లోజ్ ఫ్రెండ్‌నని స్పష్టం చేసింది. ఆ తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని ఆ రూమర్స్‌కు చెక్ పెట్టింది.

5 / 5
జోనితా గాంధీ : సింగర్ జోనితా గాంధీతోనూ అనిరుధ్ రిలేషన్‌లో ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా అనిరుధ్ పెళ్లి వార్తలు బయటకు రాగానే.. జోనితా గాంధీ ఒక సాడ్ సాంగ్ స్టోరీని, ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది అనిరుధ్ పెళ్లి గురించేనని, వీరిద్దరి మధ్య రిలేషన్‌కు బ్రేక్ పడిందని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us