పెళ్లయిందని చెప్పా.. ఖతం.. మళ్లీ అక్కడి నుంచి ఫోన్ రాలేదు : బిగ్ బాస్ బ్యూటీ

Updated on: Aug 25, 2026 | 1:56 PM

బిగ్ బాస్ గేమ్ షో పుణ్యమా అని చాలా మంది పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 10 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే బిగ్ బాస్ 10 ప్రారంభంకానుంది.

1 / 5
బిగ్ బాస్ గేమ్ షో పుణ్యమా అని చాలా మంది పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 10 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే బిగ్ బాస్ 10 ప్రారంభంకానుంది. ఇక ఇప్పుడు ఓ అందాల భామ బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీగా మారిపోయింది. యాంకర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

2 / 5
టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో తీరిక లేకుండా గడుపుతుంది. ఇక ఇప్పుడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లయిందని చెప్పగానే ఆ తాను నటిస్తున్న సినిమా ఆగిపోయిందని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు.

3 / 5
ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ కు వెళ్ళాక ముందు యాంకర్ గా చేసింది. పలు ఛానెల్స్ లో యాంకర్ గా చేసింది. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో నెటిజన్స్ ను కవ్వించింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

4 / 5
హే బలవంత్ అనే సినిమాలో నటించింది స్రవంతి. కాగా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెకు పెళ్లి కాకముందు ఒక ప్రముఖ తమిళ నటుడి కుమారుడి తొలి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చిందని.. అందుకోసం స్క్రీన్ టెస్ట్ నిర్వహించి, హీరో పక్కన నిలబెట్టి ఫోటోలు కూడా తీశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

5 / 5
మరుసటి రోజు చెన్నై వెళ్లి షూటింగ్‌లో పాల్గొనాలని, అక్కడికి వచ్చి అడ్వాన్స్ తీసుకోవాలని చెప్పారు. అయితే, చెన్నై బయలుదేరే ముందు, స్రవంతి  ఆ సినిమా మేనేజర్‌తో మాటల్లో మాటగా తనకు పెళ్లి అయిందని చెప్పిందట. దాంతో ఆ మేనేజర్, ఒక గంటలో మీకు కాల్ చేస్తానని చెప్పాడట.. అంతే ఆతర్వాత కాల్ లేదు.. ఆ సినిమా కూడా లేదట. పెళ్లయిందని చెప్పడంతో  ఆ అవకాశాన్ని కోల్పోయా అని తెలిపింది.  

Loading...
Unable to load recommendations.
Follow Us