
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రజాదరణ పొందింది ఈ గేమ్ షో.. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకొని రాణిస్తున్నారు. సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బిగ్ బాస్ గేమ్ షో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. అయితే ఓ యాంకర్ బిగ్ బాస్ వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆయన ఎవరో కాదు.. యాంకర్ రవి. బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్స్ లో రవి ఒకడు. ఓ ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ. బిగ్ బాస్ గురించి షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. బిజీ కెరీర్‌లో ఉన్నప్పటికీ బిగ్ బాస్ షోకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచిందని అయితే, దీనికి ప్రధాన కారణం డబ్బులే అని స్పష్టం చేశాడు రవి.

తనకు వచ్చిన పారితోషికం ప్రైజ్‌మనీ కంటే చాలా ఎక్కువని, బహుశా ఏ ఇతర కంటెస్టెంట్‌కు అంత డబ్బు రాలేదని అన్నాడు. మా టీవీతో తనకున్న అనుబంధం, ఆ ఛానెల్ హెడ్స్‌తో ఉన్న కుటుంబ సంబంధాల కారణంగా షోకు నో చెప్పలేకపోయానని రవి తెలిపాడు. మొదటి సీజన్‌ల నుంచి ఆహ్వానాలు ఉన్నా అప్పట్లో ఆసక్తి లేదని పేర్కొన్నాడు. డబ్బు కోసమే బిగ్ బాస్ కు వెళ్ళా అన్నాడు రవి.

బిగ్ బాస్ వల్ల వచ్చిన డబ్బుతోనే ఇల్లు కొనుగోలు చేశానని వెల్లడించాడు. నాకు వచ్చిన మనీ ఎవ్వరికీ వచ్చి ఉండవు అని రవి అన్నాడు. అలాగే బిగ్ బాస్ చూపించేది ఒక గంట ఎపిసోడ్ మాత్రమేనని, అందులో అంతా నిజం ఉండదని, లోపల జరిగేది చాలా భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. పదేళ్లుగా టీవీ పరిశ్రమలో ఉన్నందున, కంటెంట్ కోసం ఎలా ప్రవర్తించాలో తెలుసని, అందుకే కొన్నిసార్లు నాటకీయంగా వ్యవహరించాల్సి వచ్చిందని అన్నాడు రవి. కెమెరాల మధ్య ఉండగా నటన తప్పదని, నేను నటించలేదు, ఓన్ గా ఉన్నాను అని ఎవరైనా చెబితే అది అబద్ధమే అని రవి తెలిపాడు.

తన వ్యక్తిగత జీవితం గురించి, తన స్నేహితులు మాట్లాడిన అభ్యంతరకర వీడియోలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం వ్యూస్, డబ్బుల కోసం ఇతరుల వ్యక్తిత్వాన్ని చర్చించడం సరికాదని, దీనికి ఒక హద్దు ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ట్రామాను కూడా వివరించాడు. బిగ్ బాస్ నా ఆట కాదని, బయట నా కుటుంబం ఆడే ఆట అని పేర్కొన్నాడు. తనపై విమర్శలు చేసిన వారిలో కొందరిపై కేసులు పెట్టినా, దాని ద్వారా కేవలం సంతృప్తి మాత్రమే లభించిందని తెలిపాడు.