Tollywood : నువ్వు హీరోయినా.. ? ఫ్రెండ్ క్యారెక్టర్‏కు కూడా పనికిరావు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్..

Updated on: May 27, 2026 | 3:43 PM

సాధారణంగా సినీరంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలంటే ప్రతి విమర్శించే ధైర్యం ఉండాలి. ఇది చాలా మంది హీరోయిన్స్ నిరూపించిన సత్యం. తమ సినీ ప్రయాణం ప్రారంభంలో అనేక అవమానాలు, విమర్శలు, సవాళ్లు ఎదురయ్యాయని... కానీ వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ స్థాయిలో నిలబడ్డామని ఇదివరకు ఎంతో మంది ముద్దుగుమ్మలు చెప్పుకొచ్చారు. తాజాగా మరో హీరోయిన్ సైతం తన కెరీర్ తొలి నాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది.

1 / 5
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఒకప్పుడు ఆమె తండ్రి తెలుగులో క్రేజీ హీరో. కానీ చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో చిన్నప్పటి నుంచే కష్టాల మధ్య పెరిగినా ఆమె.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో తండ్రిబాటలోనే అడగుపెట్టింది. సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో పలు ప్రొడక్షన్స్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.

2 / 5
కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, సహయక పాత్రలు అందుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత కథానాయికగా అవకాశం రావడంతో తానేంటో నిరూపించుకుంది. తమిళంలో హీరోయిన్ గా సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామరస్ పాత్రలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

3 / 5
తనే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అచ్చ తెలుగమ్మాయి.. కానీ ముందు తమిళంలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాతే టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ.. అందమైన రూపం, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. వెంకీ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తాయనుకున్నప్పటికీ అంతగా రాలేదు.

4 / 5
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలు, ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న విమర్శల గురించి బయటపెట్టింది. హీరోయిన్ అంటే తప్పనిసరిగా అందంగా, తెల్లగా, సైజ్ జీరో ఉండాలనే రూల్స్ ఉండేవి. 15 ఏళ్ల క్రితం కథానాయికగా రాణించాలంటే కచ్చితంగా బొమ్మలాగా ఉండాల్సిందే అనే మైండ్ సెట్ ఉండేది. రంగు తక్కువగా ఉంటే నువ్వు హీరోయినా.. కనీసం ఫ్రెండ్ క్యారెక్టర్ కు కూడా పనికిరావు అని అవమానించేవారు అంటూ అప్పట్లో తనకు ఎదురైన పరిస్థితులను వెల్లడించింది.

5 / 5
అప్పట్లో తనను అవమానిస్తుంటే.. విమర్శిస్తుంటే ఎంతో బాధగా ఉండేదని తెలిపింది. అప్పటివరకు హీరోయిన్ కావాలన్న పెద్ద ఆశలు తనలో లేవని.. కానీ ఆ అవమానాలే తనలో కొత్త పట్టుదలను రగిలించాయని తెలిపింది. నేనెందుకు హీరోయిన్ కాలేను.. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా నటిగా నిలబడాలని నిర్ణయించుకున్నా.. అందుకే ప్రతి అవకాశం కోసం ఎదురుచూశా.. వచ్చిన ప్రతి ఛాన్స్ ఉపయోగించుకుని నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు ఐశ్వర్య రాజేష్.

Follow Us