
మణిరత్నం తెరకెక్కించిన చెలియా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ అదితిరావు హైదరీ. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మంచి విజయం సాధించింది.

తెలుగులోనూ ఈ చిన్నది సినిమాలు చేసి ఆకట్టుకుంది. తెలుగులో సమ్మోహనం తో సూపర్ హిట్ అందుకుంది అదితిరావు హైదరీ.

ఇక ఈ భామ తెలుగు, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.

హీరో సిద్దార్థ్‌తో అదితిరావు హైదరీకి మధ్య సీక్రెట్ లవ్ ఎఫైర్ నడుస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు.

తాజాగా అదితిరావు హైదరీ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మతిపోగొడుతోంది అదితిరావు .