ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..! చాలా మందికి ఈ విషయం తెలియదే

Updated on: Nov 13, 2026 | 10:06 PM

నందమూరి ఫ్యామిలీకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దివంగత నటుడు ఎన్టీఆర్ మొదలుకొని ఆయన వారసుల వరకు ఎంతోమంది ఈ కుటుంబం నుంచి హీరోలుగా పరిచయమయ్యారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తనదైన నటన, మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

1 / 5
నందమూరి ఫ్యామిలీకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దివంగత నటుడు ఎన్టీఆర్ మొదలుకొని ఆయన వారసుల వరకు ఎంతోమంది ఈ కుటుంబం నుంచి హీరోలుగా పరిచయమయ్యారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తనదైన నటన, మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్య సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

2 / 5
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ.. ఇటీవల డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో బాలకృష్ణ ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో కలిసి నటించారు. అయితే ఆయనతో కలిసి సినిమాలు చేసిన ఓ హీరోయిన్‌తో నిజ జీవితంలో కూడా ఓ ఆసక్తికరమైన బంధం ఉంది.

3 / 5
ఒకప్పుడు బాలయ్యతో జోడీ కట్టిన ఆ హీరోయిన్.. ఆ తర్వాత ఆయనకు వరుసకు కోడలు అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రౌడీ ఇన్‌స్పెక్టర్, నిప్పురవ్వ వంటి చిత్రాల్లో వీరిద్దరి జోడీకి మంచి ఆదరణ లభించింది. తెరపై హీరోహీరోయిన్లుగా సందడి చేసిన ఈ ఇద్దరి మధ్య నిజ జీవితంలోనూ బంధుత్వం ఏర్పడటం విశేషం.

4 / 5
విజయశాంతి 1988లో ఎం.వి. శ్రీనివాస్ ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు నందమూరి బాలకృష్ణతో బంధుత్వంతో పాటు మంచి స్నేహం కూడా ఉంది. బాలకృష్ణ పెద్దబావ గణేష్ రావుకు శ్రీనివాస్ ప్రసాద్ స్వయానా మేనల్లుడు అవుతారు. దీంతో బాలయ్యకు ఆయన వరుసకు కొడుకు అవుతారు. బాలకృష్ణతో కలిసి ఓ సినిమా నిర్మించాలనే ఆలోచనతో శ్రీనివాస్ ప్రసాద్ యువరత్న ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నిప్పురవ్వ సినిమాను నిర్మించారు.

5 / 5
ఈ సినిమా కోసం హీరోయిన్‌గా విజయశాంతిని సంప్రదించడంతో ఆమెకు శ్రీనివాస్ ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి చివరకు వివాహ బంధానికి దారితీసింది. అలా బాలకృష్ణతో ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన విజయశాంతి.. శ్రీనివాస్ ప్రసాద్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆయనకు వరుసకు కోడలయ్యారు. తెరపై హీరోహీరోయిన్లుగా కనిపించిన ఈ ఇద్దరి మధ్య ఇలాంటి బంధుత్వం ఉండటం నందమూరి అభిమానులకు కూడా ఆసక్తికరమైన విషయమే.

Loading...
Unable to load recommendations.
Follow Us