వామ్మో తమన్నా అన్ని కష్టాలు పడిందా.. చెప్తుంటే బాధేస్తోంది కదా!

Updated on: Oct 16, 2025 | 10:55 AM

అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పా్లసిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం, తాజాగా ఈ చిన్నది, కెరీర్ స్టార్టింగ్‌లో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పింది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 4
కళ్లు తడవకుండా లైఫ్‌నీ, కాళ్లు తడవకుండా సముద్రాన్ని, కష్టాలు పడకుండా ఇండస్ట్రీని దాటిన వాళ్లు లేరన్నట్టుంది తమన్న చెప్పిన మాటలు వింటుంటే. కెరీర్‌ తొలినాళ్లలో సౌత్‌లో తాను పడ్డ ఇబ్బందుల గురించి మాట్లాడారు మిల్కీబ్యూటీ.

2 / 4
చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చారు తమన్నా. ఆ టైమ్‌లో ఆమెకు ఏమీ తెలియదనుకుని చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించేవారట. ఇలా చాలా సార్లు జరిగిందంటారు మిల్కీబ్యూటీ.

3 / 4
ఒకానొక సందర్భంలో పెద్ద స్టార్‌ హీరోతో పనిచేసే అవకాశం వచ్చిందట. కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు అన్‌ ఈజీగా అనిపించిందని, ఆ విషయాన్నే మేకర్స్ తో చెప్పానని, ఆ టైమ్‌లో హీరో తనని అందరి ముందు అరిచిన అరుపులు ఇంకా గుర్తున్నాయని అన్నారు తమన్నా.

4 / 4
హీరోయిన్‌ని మార్చేయండి అని అతను అన్నప్పటికీ, తాను సంయమనం పాటించినట్టు చెప్పారు. నెక్స్ట్ డే ఆ హీరో తన దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పారన్నారు. ఇంతకీ హీరో ఎవరని అడిగితే మాత్రం ష్‌.. గప్‌చుప్‌ అని మాట దాటేశారు తమన్నా.