
ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ సప్తమి గౌడ. కాంతార సినిమాతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. జూన్ 8, 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరులో జన్మించింది వయ్యారి భామ సప్తమి గౌడ. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి పేరు శాంత గౌడ. సినిమాల్లో ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

ఇక ఈ అమ్మడి స్టడీ విషయానికొస్తే.. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార . చదువుకొనే రోజుల్లో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది ఈ అందాల తార. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా ఉంది. తెలుగులోనూ ఆ మధ్య అవకాశాలు అందుకుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది.

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ విడుదలై అన్ని భాషల్లో విజయం సాధించింది. దాంతో ఆమె పేరు మారుమ్రోగింది. తెలుగులోనూ ఈ అమ్మడు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది.

ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి. దాంతో తెలుగులోనూ నటించి మెప్పించింది.

నితిన్ తమ్ముడు సినిమాతో తొలిసారి తెలుగులో కథానాయికగా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ బ్యూటీకి పెద్దగా తెలుగులో ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది సప్తమి. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది సప్తమి గౌడ.