
నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకుంది. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా అందుకుంది.

కాగా ఇప్పటికే పలు పుస్తకాలు రచించిన అన్షు మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్గానూ అన్షు రాణిస్తోంది. ఇక చూడ్డానికి అచ్చం రోజాకు జిరాక్స్ కాపీలా ఉండే అన్షుకు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా ఉండే అన్షు తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను పంచుకుంటుంది.

అన్షు ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్, వీడియోలు చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అన్షు అచ్చం తన తల్లి రోజాకు జిరాక్స్ కాపీలా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక చాలామంది అన్షును సినిమాల్లోకి రావాలని కూడా కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా ఆ మధ్యన రోజా కూతురు పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని రూమర్లు వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరో ఇంటికి అన్షు కోడలిగా వెళ్లనుందని తెగ ప్రచారం జరిగింది.

తన కూతురు పెళ్లి వార్తలను ఖండించిన రోజా తన చెవికి అలాంటి ప్రపోజల్స్ ఏమీ రాలేదని స్పష్టం చేశారు. అంతేకాదు అనుషుమాలికకు ఉన్నత చదువు పట్ల చాలా ఆసక్తి ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో చదువుకుంటుందని, శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఉందని రోజా తెలిపారు.