Actress Roja : రోజా బర్త్‌డే వేడుకల్లో సినీ తారల సందడి.. అదరగొట్టిన అలనాటి స్టార్స్.. ఫోటోస్ వైరల్..

Updated on: Nov 17, 2026 | 4:22 PM

ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలను తన అందం, అభినయంతో ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో ఆర్కే రోజా ఒకరు. అగ్ర హీరోలందరితో కలిసి నటించిన ఆమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ సినీరంగంలో చాలా యాక్టివ్ గా ఉంటూ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా రోజా బర్త్ డే వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది.

1 / 5
సౌత్ సీనియర్ హీరోయిన్ రోజా సెల్వమణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సీనియర్ హీరోయిన్స్ మీనా, సంగీతతోపాటు కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా, ప్రముఖ దర్శకుడు శంకర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించిన తారలు ఒకే వేదికపై కనిపించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కలిసి కనిపించడం విశేషం.

2 / 5
అతిథులంతా రోజాతో కలిసి సరదాగా గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది సినీ ప్రముఖులను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజాకు ప్రభుదేవా, మీనా కేక్ తినిపించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే 90s క్లాస్ రీయూనియన్ బ్యాచ్‌కు చెందిన పలువురు నటీనటులు ఈ వేడుకలో పాల్గొని రోజాకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

3 / 5
రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె 1972 నవంబర్ 17న తిరుపతి జిల్లాలో జన్మించారు. ఈ పుట్టినరోజుతో ఆమెకు 54 ఏళ్లు సంవత్సరాలు. 1991 నుంచి 2002 వరకు తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర కథానాయికగా వెలిగారు. ఆ కాలంలో రెండు భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

4 / 5
మీనాతో రోజాకు మంచి స్నేహం ఉంది. చిన్నతనంలో ఇద్దరూ ఒకేలా కనిపించేవారు. అప్పట్లో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచేదని గతంలో మీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా తామిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారి స్నేహం ఇలా వేడుకల్లో కనిపిస్తోంది. రోజా 2002లో దర్శకుడు ఆర్.కె. సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు.

5 / 5
 ప్రస్తుతం సినిమాలతోపాటు అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు రోజా. ఇదిలా ఉంటే.. రోజా బర్త్ డే సందర్భంగా ఆమెకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.  చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు రోజా. ఇటీవల తమిళంలో ఆమె నటించిన చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగులోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే చేసేందుకు రోజా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us