
రిద్ధి కుమార్.. లవర్ సినిమాతో చలన చిత్ర అరంగేట్రం చేసింది. రాజ్ తరుణ్ సరసన కథానాయకిగా ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ధి.

రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో అర్చరీ ప్లేయర్ గా కనిపించింది. ఆతర్వాత రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో కనిపించి అలరించింది.

ఈ బ్యూటీ హిందీ, మరాఠీ, మళయాళ ఇలా చాలా భాషల్లో వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అంతే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.

రాజా సాబ్ సినిమాలో తన అందాలతో మెప్పించింది ఈ అమ్మడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మ ఆశలు అడియాశలయ్యాయి. రాజా సాబ్ సినిమా విజయం సాధించి ఉంటే ఈ అమ్మడు తెలుగులో స్టార్ డమ్ సొంతం చేసుకునేది.

కానీ రాజా సాబ్ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో రిద్ధి కుమార్ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ కు మతిపోగొడుతోంది.