
పూనమ్ బజ్వా.. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందాలతో ప్రేక్షకులను కవ్వించింది ఈ వయ్యారి.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది పూనమ్ బజ్వా. తెలుగులో 2005లో వచ్చిన మొదటి సినిమా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

ప్రేమంటే ఇంతే సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో హీరోయిన్ పాత్రలు దక్కకపోవడంతో సెకండ్ హీరోయిన్‌గాను నటించింది.

చివరిగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు లో కనిపించింది పూనమ్ బజ్వా. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయలేదు పూనమ్ బజ్వా.

సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. పూనమ్ ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా మరికొన్ని ఫోటోలు పంచుకుంది పూనమ్.