అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.. అతనే నా లక్కీచార్మ్ : మృణాల్ ఠాకూర్

Updated on: Nov 13, 2026 | 9:58 PM

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. తెలుగులోనూ ప్రేక్షకులను అలరించింది. సీతారామం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత తెలుగుల , ఓ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1 / 5
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. తెలుగులోనూ ప్రేక్షకులను అలరించింది. సీతారామం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత తెలుగుల , ఓ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది మృణాల్. కాగా గతంలో మృణాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

2 / 5
ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. రణ్‌వీర్ సింగ్‌ను తన లక్కీ చార్మ్‌గా అభివర్ణించిన మృణాల్.. ప్రస్తుతం తాను నటిగా ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ఒకరకంగా ఆయనే కారణమని చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో రణ్‌వీర్‌తో కలిసి ఓ హెయిర్ బ్రాండ్ కమర్షియల్ యాడ్‌లో నటించినట్లు గుర్తు చేసుకున్నారు.

3 / 5
ఆ ప్రకటన ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిందని, ఆ తర్వాత సినీ నిర్మాతలు తనను గుర్తించి సినిమా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారని వెల్లడించారు. అంతేకాకుండా రణ్‌వీర్ సింగ్ వ్యక్తిత్వంపై కూడా మృణాల్ ప్రశంసలు కురిపించారు. ఆయన ఎంతో పాజిటివ్‌గా ఉంటారని, తన పనిపై అపారమైన అంకితభావం చూపిస్తారని అన్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ అందుకుంటున్న విజయాల వెనుక ఆయన కష్టం, పట్టుదల ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

4 / 5
ఇక రణ్‌వీర్ నటించిన 'ధురంధర్ 2' సినిమా గురించి మాట్లాడుతూ ఆయన నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమా చూస్తున్నంతసేపు తనకు రణ్‌వీర్ సింగ్ కనిపించలేదని, కేవలం హమ్జా అనే పాత్ర మాత్రమే కనిపించిందని అన్నారు. అంతలా ఆ పాత్రలో లీనమై నటించారని కొనియాడారు. ఒక స్టార్ హీరోగా కాకుండా, పూర్తిగా ఆ పాత్రకు ప్రాణం పోస్తూ తనలోని నటనా ప్రతిభకు మరో కోణాన్ని చూపించారని పేర్కొన్నారు.

5 / 5
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా రణ్‌వీర్‌తో తన కెరీర్‌కు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకోవడం నెట్టింట చర్చకు దారితీసింది. ఇక తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మృణాల్.. తన నటనతో పాటు అందంతోనూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us