
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం చాలా కష్టం కొంతమంది ముద్దుగుమ్మలు వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ స్టార్ డమ్ తెచ్చుకోలేకపోతున్నారు. సాలిడ్ హిట్ కోసమే ఎదురుచూస్తున్న భామలు చాలా మంది ఉన్నారు.

అలాగే కొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భామ ఒకరు. ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమా చేసి ఆతర్వాత మాయం అయ్యింది.

ఆమె ఎవరో కాదు ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్.. ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

తన స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ. ‘కారవాన్’, వెబ్ ప్రియులకు ‘లిటిల్ థింగ్స్’ లాంటి సిరీస్ లతో మిథిలా పాల్కర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడి నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఓరి దేవుడా సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు ఈ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తుంది. రీసెంట్ డేస్ లోకి గ్లామర్ డోస్ పెంచేసింది. క్రేజీ ఫొటోలతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఈ వయ్యారి భామ.