
ఇన్ స్టా రీల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. దీంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. అప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. .?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ఇమాన్వి. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ హీరోయిన్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యేందుకు ఎదురుచూస్తుంది ఇమాన్వి. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

కథానాయికగా ఇమాన్వికి ఇదే మొదటి సినిమా. అంతకు ముందు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నెట్టింట పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా ప్రభాస్ జోడిగా సెలక్ట్ చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ఛాన్స్ కొట్టేసిందట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ సినిమా చేయనున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఇమాన్విని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమా విడుదల కాకముందే ఆమెకు వరుసగా అవకాశాలు తలుపుతట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.