
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల భామ.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. మొదట్లో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో ఆకట్టుకున్న అనుపమ.. ఆ తర్వాత తన నటనలో కొత్తదనాన్ని చూపిస్తూ విభిన్నమైన కథలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు, ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది.

హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నటిగా తన పరిధిని పెంచుకోవడంపై అనుపమ ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. పాత్ర నిడివి కంటే అందులో తనకు నటనకు ఎంత అవకాశం ఉందనే విషయానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె ఎంపికలు చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనపై క్రష్ ఉందని అనుపమ చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో యాంకర్ మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగ్గా.. అనుపమ తనదైన శైలిలో స్పందించింది. మహేష్ చాలా హ్యాండ్సమ్ అని, ఆయన అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అంతేకాకుండా ఆయనంటే తనకు క్రష్ ఉందని మనసులోని మాటను బయటపెట్టింది. అంతటితో ఆగకుండా మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే చేస్తారా? అని యాంకర్ మరో ప్రశ్న సంధించింది. దీనికి అనుపమ ఏమాత్రం తడబడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహేష్ సినిమాలో విలన్ పాత్ర చేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే మహేష్ బాబును సినిమాలో కోపంగా చూడాల్సి వస్తే మాత్రం తాను ఆ పాత్రకు న్యాయం చేయలేకపోవచ్చని సరదాగా చెప్పింది.

ఆయనను చూస్తూ ఉంటే విలన్‌లా కాకుండా రొమాంటిక్‌గా చూడాలనిపిస్తుందని, ఆయన తన వైపు చూస్తే అసలు నటించడం కూడా మర్చిపోయే అవకాశం ఉందని నవ్వులు పూయించింది.ప్రస్తుతం అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. మహేష్‌పై తన అభిమానాన్ని ఇంత సరదాగా వ్యక్తం చేయడంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి తెరపై విభిన్న పాత్రలతో అలరిస్తున్న అనుపమ.. తన అభిమాన హీరో గురించి చేసిన ఈ వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది.