
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో దశాబ్దాలుగా హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. మాస్ యాక్షన్ హీరోగా తన నటనతో కోట్లాది మంది అభిమనులను సంపాదించుకున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న బైకర్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్లో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అయితే తాను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక రోల్ మిస్సైనట్లు తెలిపారు. తెలుగు మల్టీస్టారర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ హిట్ మూవీలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. ఈ చిత్రంలో పెద్దోడు, చిన్నోడు పాత్రలలో వెంకటేశ్, మహేష్ బాబు ఎంతగా అలరించారో చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ మూవీకి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

ఈ చిత్రంలో వెంకీ, మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ఎంతో ఆకట్టుకున్నారు. ఏం జరిగినా అంతా మన మంచికే అన్నట్లు వ్యవహరించే ఈ రేలంగి మామయ్య పాత్ర కోసం ముందుగా రాజశేఖర్ ను అనుకున్నారట. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన నటించలేకపోయారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సీతమ్మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే క్యారెక్టర్ కోసం మేకర్స్ తనను సంప్రదించారని అన్నారు.

తన నవ్వు బాగుంటుందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆ రోల్ నేను చేస్తే బాగుంటుందని అడిగారు. కానీ నేను చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు. నటించనందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని అడగ్గా.. అలాంటిదేం లేదని అన్నారు. తనకు డ్యాన్స్ చేయడం ఇష్టం ఉండేది కాదని.. అందుకే కెరీర్ ప్రారంభంలో కష్టపడాల్సిన వచ్చేదని అన్నారు. అలా చేస్తూ ఉండగా కొన్నాళ్లకు డ్యాన్స్ అలవాటు అయిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజశేఖర్, శర్వానంద్ కలిసి నటించిన బైకర్ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.

అలాగే తనకు గోళీల ఫ్యాక్టరీ ఉందంటూ వచ్చిన రూమర్స్ నవ్వుతూ స్పందించారు. దాని ద్వారా నెలకు రూ. 3 కోట్లు సంపాదిస్తున్నానట. ఎందరికోఉపాధి కల్పిస్తున్నానని అన్నారు. ఇంతకీ అదెక్కడ ఉందో తెలిస్తే బాగుంటుందని.. ఈ వార్తలు చూసి ఎంతో మంది కాల్ చేశారని.. మీకు గోళీల ఫ్యాక్టరీ ఉందా అని అడిగారని అన్నారు. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ స్టార్ట్ చేసిన రాజశేఖర్ బైకర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇకపై సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.