
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో ఒకరైన నవీన్ చంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో ఇతర హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన అతను అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాలోనే తన అద్బుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

దీని తర్వాత దళం, భమ్ భోలేనాథ్, త్రిపుర, లక్ష్మీ దేవికి ఓ లక్కుంది, మీలో ఎవడు కోటీశ్వరుడు, జూలియన్ లవర్ ఆఫ్ ఈడియట్, భానుమతి రామకృష్ణ, మంత్ ఆఫ్ మధు, 28 డిగ్రీల సెల్సియస్, బ్లైండ్ స్పాట్, లెవెన్, షో టైమ్, హనీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ హీరో.

మరీ ముఖ్యంగా ఈ మధ్యన తెలుగులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు నవీన్ చంద్ర. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్ గానూ ఆకట్టుకుంటున్నాడీ ట్యాలెంటెడ్ హీరో.

నేను లోకల్, మిస్ ఇండియా, ఎవరు, అరవింద సమేత వీర రాఘవ, విరాట పర్వం, జిగర్తాండ డబుల్ ఎక్స్, మాస్ జాతర, మార్క్ తదితర సినిమాల్లో నవీన్ విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి.

సినిమాల సంగతి పక్కన పెడితే.. నవీన్ చంద్ర భార్య పేరు ఒర్మా. వీరిది ప్రేమ వివాహం. అన్నట్లు ఒర్మాకు కూడా సినిమా ఇండస్ట్రీ నేపథ్యం. ఆమె చాలా సంవత్సరాల పాటు మలయాళంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసింది.

కాగా శుక్రవారం (జూన్ 12) నవీన్ చంద్ర- ఒర్మాల పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన సతీమణికి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందులో నవీన్ చంద్ర భార్య, కుమారుడు ఎంతో క్యూట్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి