Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..

Updated on: Nov 17, 2026 | 10:06 PM

జగపతి బాబు తన జీవితంలో కుటుంబానికి, ముఖ్యంగా భార్య, కూతుర్లకు ఇచ్చే ప్రాధాన్యతను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్థిక కష్టాల్లో, డిప్రెషన్ సమయంలో భార్య అందించిన అండను గుర్తుచేసుకున్నారు. కూతుళ్లు మేఘన, శ్రేయల పట్ల ప్రేమను, స్నేహితుడు అర్జున్ చేసిన సహాయాన్ని వివరించారు. యువ తారలు, దర్శకులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

1 / 5
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు లవర్ బాయ్‌గా, ఆ తర్వాత స్టార్ హీరోగా వెలుగొందిన జగపతి బాబు ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. అయితే ఆయన వృత్తిపరంగా ఎంతటి ఉన్నత స్థితిని చూశారో, వ్యక్తిగత జీవితంలోనూ అన్నింటికంటే కఠినమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

2 / 5
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన జీవితంలోని క్లిష్ట పరిస్థితులు, ఎదురైన ఇబ్బందులు, తన కుటుంబం ముఖ్యంగా తన భార్య తన జీవితంలో పోషించిన కీలక పాత్ర గురించి తొలిసారిగా చాలా విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డానని జగపతిబాబు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయంటే ఏకంగా తమ ఇంటిని సైతం విక్రయించాల్సి వచ్చిందని తెలిపారు.

3 / 5
ఇల్లు అమ్మినప్పటికీ అప్పట్లో ఇంకా మూడు కోట్ల రూపాయల అప్పు మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 'లెజెండ్' సినిమా షూటింగ్ నిమిత్తం తాను వైజాగ్‌లో ఉన్న సమయంలో తన కుటుంబం ఇల్లు ఖాళీ చేసిందని, ఆ సమయంలో తాను వారి దగ్గర లేకపోవడం వల్ల తన భార్య, పిల్లలు ఎంతటి మానసిక వేదనను అనుభవించారో తలుచుకుంటే ఇప్పటికీ బాధనిపిస్తుందని ఎమోషనల్ అయ్యారు.

4 / 5
తన కష్టకాలంలో భార్య, పిల్లలు ఏనాడూ తనను నిందించలేదని, తన గైర్హాజరీ గురించి ప్రస్తావించి ఇబ్బంది పెట్టలేదని జగపతిబాబు ప్రశంసించారు. 'అంతఃపురం' సినిమా డబ్బింగ్ సమయంలో తన చిన్న కుమార్తెకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే, తన భార్య ఒంటరిగా ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కొన్న తీరు తనను ఎంతగానో కదిలించిందన్నారు. తన భార్య లేకపోతే తాను లేనని, ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని జగపతి బాబు గారు భావోద్వేగానికి లోనయ్యారు.

5 / 5
తన కుటుంబ సభ్యులు సినీ నేపథ్యం ఉన్నవారు కాకపోవడం వల్ల లైమ్‌లైట్‌కు, పబ్లిసిటీకి పూర్తిగా దూరంగా ఉంటారని తెలిపారు. అందుకే తాము ఎక్కడికైనా వెళ్లినప్పుడు తన పక్కన కాకుండా ముందు లేదా వెనుక నడుస్తారని, వారి వ్యక్తిగత జీవితానికి వారు ఎంతో గౌరవం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. కుటుంబం అందించిన అండదండలు, ఆత్మస్థైర్యమే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని జగపతిబాబు చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us