ఆ స్టార్ హీరోతో నాకు మంచి బాండింగ్ ఉంది.. అతను చూపించిన ఆత్మీయత ఎంతో గొప్పది

Updated on: Sep 28, 2026 | 2:14 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు పొందిన నటుడు అజయ్, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి, జనతా గ్యారేజ్ సినిమా అనుభవాల గురించి, అలాగే దర్శకుడు కొరటాల శివ నుంచి తనకు లభించిన ప్రశంసల గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

1 / 5
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు పొందిన నటుడు అజయ్, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి, జనతా గ్యారేజ్ సినిమా అనుభవాల గురించి, అలాగే దర్శకుడు కొరటాల శివ నుంచి తనకు లభించిన ప్రశంసల గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. జనతా గ్యారేజ్ ఆడియో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సంఘటనను అజయ్ రావూరి గుర్తు చేసుకున్నారు.

2 / 5
ఈవెంట్‌లో తాను జూనియర్ ఎన్టీఆర్‌ను తారక్ సార్ అని సంబోధించగా, ఎన్టీఆర్ ఆయన్ను ఆపి, స్వయంగా తన దగ్గరికి వచ్చి తారక్ అని పిలవమని కోరారని అజయ్ వెల్లడించారు. మొదటి నుంచీ తారక్‌ను తారక్ అనే పిలిచే అలవాటు ఉన్నప్పటికీ, సభా మర్యాద దృష్ట్యా సార్ అని సంబోధించినట్లు అజయ్ రావూరి తెలిపారు. అయితే, ఎన్టీఆర్ చూపిన ఈ ఆత్మీయత ఎంతో గొప్పదని, అది తనకెంతో మధురమైన జ్ఞాపకమని ఆయన పేర్కొన్నారు.

3 / 5
అలాగే, జనతా గ్యారేజ్ చిత్రంలోని తన పాత్ర, అలాగే  రాజీవ్ కనకాల గురించి రెండు ముఖ్యమైన విషయాలను అజయ్ ప్రస్తావించారు. డబ్బింగ్ చెప్పి బయటకు రాగానే, రాజీవ్ కు ఫోన్ చేసి "మేము సినిమా కోసం ఇన్ని రోజులు కష్టపడితే, నువ్వు ఒక్క సీన్‌తో సినిమానంతా తీసుకెళ్లిపోయావురా" అని అభినందించానని తెలిపారు. అతని పాత్ర ఎంత పవర్‌ఫుల్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. తాను "మేమంతా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే, నువ్వు T20 మ్యాచ్ ఆడి వెళ్ళిపోయావు భయ్యా" అని సరదాగా అన్నాను అని అజయ్  పేర్కొన్నారు.

4 / 5
రాజీవ్ పాత్ర చిత్రానికి ఆత్మ లాంటింది, క్లైమాక్స్‌కు దారి తీసే కీలకమైన మలుపు రాజీవ్ పాత్ర, ఆ తర్వాత తన పాత్ర మరణం ద్వారానే వస్తుందని ఆయన వివరించారు. రాజీవ్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతకు దర్శకుడు కొరటాల శివగారి రచన శైలి ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు శివతో తనకున్న అనుబంధం గురించి కూడా అజయ్  మాట్లాడుతూ.. శివగారు తనకు సోదరుడితో సమానమని, ఆయన తనకు ప్రతి సినిమాలో అవకాశాలు ఇస్తూ, ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారని తెలిపారు.

5 / 5
ఒక సందర్భంలో శివగారు బహిరంగంగా "అజయ్ నా ఫేవరెట్ యాక్టర్" అని చెప్పడం తనకెంతో ఆనందాన్ని, గుర్తింపును ఇచ్చిందని అజయ్ పేర్కొన్నారు. బయట ప్రజల గుర్తింపుతో పాటు, సినీ పరిశ్రమలో దర్శకులు, రచయితలు తమను మంచి నటులుగా గుర్తించడం సహాయ నటులకు చాలా ముఖ్యమని అజయ్ అన్నారు. హీరోలకు అభిమానుల సంఖ్య, టికెట్ల అమ్మకాలు ముఖ్యమైనవని, కానీ తమ వంటి సహాయ నటులకు దర్శకులు తమ గురించి ఏమనుకుంటున్నారనేది చాలా విలువైనదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అజయ్. 

Loading...
Unable to load recommendations.
Follow Us