Cinema : వామ్మో.. ఏం సస్పెన్స్ ట్విస్టులు రా నాయనా.. ఓటీటీలో పిచ్చెక్కిస్తున్న నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్ సైకాలజికల్ మూవీ..

Updated on: Oct 26, 2026 | 9:12 PM

ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు దూసుకుపోతున్నాయి. భాషతో సంబంధం లేకుండా విడుదలవుతున్న చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ హిందీలో నటించిన ఓ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై దుమ్మురేపుతుంది. ప్రతి క్షణం కొత్త కొత్త ట్విస్టులతో ఈ చిత్రం దుమ్మురేపుతుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా గురించి తెలుసుకుందామా.

1 / 5
డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ సినిమాలకు , వెబ్ సిరీస్‌లకు ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. సీటు అంచున కూర్చోబెట్టే ట్విస్టులు, ఊహించని మలుపులతో సాగే కథలను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడతారు. అలాంటి మైండ్ బెండింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం వెతుకుతున్నట్టయితే, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, టాలీవుడ్ ప్రముఖ నటి నిత్యా మీనన్ జంటగా నటించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ (Breathe: Into The Shadows) కచ్చితంగా చూడదగ్గది.

2 / 5
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఐఎమ్‌డీబీలోనూ అద్భుతమైన రేటింగ్‌ను దక్కించుకుంటూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. డాక్టర్ అవినాష్ సబర్వాల్ (అభిషేక్ బచ్చన్) ఒక నిపుణుడైన సైకియాట్రిస్ట్. ఆయన భార్య ఆభా (నిత్యా మీనన్), ఆరేళ్ల కుమార్తె సియాతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తుంటాడు. అందరిలాగే సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఒకరోజు ఊహించని విషాదం చోటుచేసుకుంటుంది.

3 / 5
వారి చిన్నారి కూతురు సియా హఠాత్తుగా కిడ్నాప్‌కు గురవుతుంది. సుమారు తొమ్మిది నెలల పాటు పాప ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పడని పాట్లు లేవు, ఎంత వెదికినా ఎలాంటి క్లూ దొరకదు. అదే సమయంలో మాస్క్ ధరించిన ఒక అపరిచిత వ్యక్తి నుంచి అవినాష్‌కు ఫోన్ కాల్ వస్తుంది. కూతురు ప్రాణాలతో తిరిగి రావాలంటే తాను చెప్పిన కొందరిని వెతికి మరీ హత్య చేయాలని కండిషన్ పెడతాడు. ఒక సామాన్య డాక్టర్ తన కూతురిని కాపాడుకోవడం కోసం నేరస్తుడిగా ఎలా మారాడు? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటనే ఉత్కంఠతో మొదటి సీజన్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది.

4 / 5
ఈ వరుస హత్యల కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కబీర్ సావంత్ (అమిత్ సాధ్) దర్యాప్తు ప్రారంభిస్తాడు. దర్యాప్తులో భాగంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. డాక్టర్ అవినాష్ 'డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్' (స్ప్లిట్ పర్సనాలిటీ) సమస్యతో బాధపడుతున్నాడని, అతనిలోని మరో భయంకరమైన కోణమే 'జె' అనే మానసిక స్వరూపమని తెలుస్తుంది. రెండో సీజన్‌లో 'జె' మానసిక ఆసుపత్రి నుంచి తప్పించుకుని తన పగను మరింత పెంచుకుంటాడు.

5 / 5
మీడియా అతనికి 'రావణ్ కిల్లర్' అని పేరు పెడుతుంది. పురాణాల్లోని అంశాలను జోడిస్తూ తన పగను తీర్చుకునేందుకు రంగంలోకి దిగుతాడు. హీరో అనుకున్న వ్యక్తి తనలోని మరో కోణంతో ఎలా విలన్‌గా మారాడనే పాయింట్ ఈ సిరీస్‌కు ప్రధాన హైలైట్. మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్, అమిత్ సాధ్ తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సిరీస్ వీకెండ్‌లో మంచి థ్రిల్లర్ అనుభూతిని ఇస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us