17ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన క్రేజీ మూవీ.. చూడాలంటే గుండె దైర్యం ఉండాల్సిందే

Updated on: Oct 21, 2026 | 1:52 PM

ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు విభిన్న జానర్ సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి అదిరిపోయే సినిమాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’   సినిమా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

1 / 5
ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు విభిన్న జానర్ సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి అదిరిపోయే సినిమాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’   సినిమా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. క్రూరమైన నేరం.. కూతురికి జరిగిన అన్యాయం.. ప్రతీకారం తీర్చుకోవడానికి తల్లిదండ్రులు చేసే పోరాటం.. ఇలా ఉత్కంఠభరితమైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అస్సలు మిస్ అవ్వకండి. 

2 / 5
దర్శకుడు డెన్నిస్ ఇలియాడిస్ తెరకెక్కించిన ‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’ చిత్రం 2009 మార్చి 13న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు వెస్ క్రావెన్ 1972లో రూపొందించిన ఇదే పేరుతో ఉన్న హారర్ చిత్రానికి ఇది రీమేక్. విడుదలైన సమయంలోనే హింసాత్మక సన్నివేశాలు, ప్రతీకారంతో కూడిన కథాంశం కారణంగా ఈ సినిమా చర్చనీయాంశమైంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రం థ్రిల్లర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

3 / 5
జాన్, ఎమ్మా దంపతులు తమ కుమార్తె మేరీతో కలిసి సరస్సు సమీపంలోని తమ ఇంటికి వస్తారు. అక్కడ మేరీ తన స్నేహితురాలు పైజ్‌తో కలిసి బయటకు వెళ్తుంది. అయితే అనుకోకుండా పోలీసుల నుంచి తప్పించుకుంటున్న నేరస్థుల ముఠా చేతికి ఆ ఇద్దరు యువతులు చిక్కుతారు. ఆ తర్వాత వారిపై దారుణమైన దాడి జరుగుతుంది. మేరీ చనిపోయిందని భావించిన నేరస్థులు ఆమెను అడవిలో వదిలిపెట్టి వెళ్లిపోతారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మేరీ ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. ఎలాగోలా తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి చేరుకుంటుంది. మరోవైపు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశ్రయం కోసం వచ్చిన కొందరు వ్యక్తులకు జాన్, ఎమ్మా తమ ఇంట్లో చోటు కల్పిస్తారు. అయితే ఆ వ్యక్తులే తమ కుమార్తెకు తీరని అన్యాయం చేసిన నేరస్థులని వారికి తెలియదు.

4 / 5
తమ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న వ్యక్తుల అసలు స్వరూపం బయటపడిన తర్వాత కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. తమ కూతురికి జరిగిన దారుణాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతారు. సాధారణంగా ప్రశాంతంగా జీవించే ఆ దంపతులు నేరస్థులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. ఒకవైపు తమ కుమార్తెను కాపాడుకోవాలనే తపన.. మరోవైపు ఆమెకు అన్యాయం చేసినవారికి శిక్ష విధించాలనే ఆగ్రహం.. ఈ రెండింటి మధ్య కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. నేరస్థులు సురక్షితంగా ఉన్నామని భావించిన ఆ ఇల్లు, క్రమంగా వారికి తప్పించుకోలేని ప్రమాదకరమైన ప్రదేశంగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తల్లిదండ్రులు తమ కూతురికి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? అనేది సినిమాలో చూడాల్సిందే.

5 / 5
 ‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’ను సాధారణ దెయ్యాల సినిమాగా భావించకూడదు. ఇందులో అతీంద్రియ శక్తుల కంటే మనుషుల్లోని క్రూరత్వం, బాధ, కోపం, ప్రతీకారం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నేరం జరిగిన తర్వాత బాధితుల కుటుంబం ఎదుర్కొనే మానసిక సంఘర్షణతో పాటు, న్యాయం కోసం చేసే పోరాటాన్ని ఈ సినిమా చూపిస్తుంది. అయితే ఇందులో హింసాత్మకమైన, కలవరపరిచే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 

Loading...
Unable to load recommendations.
Follow Us