Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..

Updated on: Oct 21, 2026 | 6:49 PM

గత 8 ఏళ్లుగా ఓటీటీ ప్రపంచాన్ని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి మీకు తెలుసా.. ? ఇప్పటివరకు 3 సీజన్లలోని 29 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించిన ఈ ఫ్రాంచైజీ నుంచి త్వరలో ' సీజన్ 4' రానుంది. దీనికంటే ముందు వచ్చిన 'ది మూవీ'తో పాటు నాలుగో సీజన్ అప్‌డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

1 / 5
భారతీయ డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో ఎన్నో వెబ్ సిరీస్‌లు వచ్చిపోతుంటాయి. కానీ, కొన్ని మాత్రం ప్రేక్షకులకు ఒక ఎమోషన్‌గా మారిపోతాయి. ముఖ్యంగా పవర్, పాలిటిక్స్, గ్యాంగ్‌వార్ , నేర ప్రపంచం నేపథ్యంలో తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి అగ్రశ్రేణి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లలో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

2 / 5
అదే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న సంచలన వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా 2018లో ప్రారంభమైన ఈ సిరీస్, గత 8 సంవత్సరాలుగా ఓటీటీ ప్రపంచంలో తన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గకుండా కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతం, గన్ ట్రేడింగ్, రాజకీయ ఆధిపత్యం , కుటుంబాల మధ్య జరిగే రక్తపాత ప్రతీకారాల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేసింది.

3 / 5
 ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుంచి 3 అద్భుతమైన సీజన్లు విడుదలయ్యాయి. మొదటి సీజన్‌లో 9 ఎపిసోడ్లు, రెండో సీజన్‌లో 10 ఎపిసోడ్లు, అలాగే మూడో సీజన్‌లో 10 ఎపిసోడ్లతో కలిపి మొత్తం 29 ఎపిసోడ్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ వెబ్ సిరీస్‌లో నటించిన నటీనటుల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కాలీన్ భయ్యా' పాత్రలో పంకజ్ త్రిపాఠి తన గంభీరమైన అభినయంతో ప్రేక్షకులను భయపెడుతూనే ఆకట్టుకున్నారు.

4 / 5
అలాగే 'గుడ్డూ పండిట్' పాత్రలో అలీ ఫజల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, 'మున్నా భయ్యా'గా దివ్యేందు శర్మ చూపించిన విలనిజం సిరీస్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. వీరితో పాటు రషీకా దుగల్, శ్వేతా వంటి నటులు తమ పాత్రలతో ప్రాణం పోశారు. మూడు విజయవంతమైన సీజన్ల తర్వాత, మేకర్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను మరింత ముందుకు తీసుకొచ్చారు. ఓటీటీలో మాత్రమే కాకుండా, ఈ కథను మరింత గ్రాండ్‌గా చూపించేందుకు 'మిర్జాపూర్: ది మూవీ' (Mirzapur: The Movie) పేరుతో సినిమాను కూడా తెరకెక్కించారు.

5 / 5
మీర్జాపూర్: ది మూవీ' సెప్టెంబర్ 4, 2026న విడుదలైన తర్వాత, సీజన్ 4 కోసం స్క్రిప్ట్ వర్క్ వేగవంతం చేశారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి (గోలు), రసికా దుగల్ వంటి ప్రధాన తారాగణం ఈ సీజన్‌లో కూడా కొనసాగనున్నారు. డైరెక్టర్ గుర్‌మీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, సినిమా కథకు కొనసాగింపుగానే నాలుగో సీజన్ ప్లాన్ చేశారట. దీంతో క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు త్వరలోనే మరో భారీ విందు దొరకడం ఖాయంగా కనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us