Tamil Films: కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?

| Edited By: Prudvi Battula

Jul 17, 2024 | 3:49 PM

తెలుగు, కన్నడ సినిమాలకు మాత్రమే 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉందా..? తమిళ సినిమాలకు 1000 కోట్లు ఎప్పటికీ కలగానే ఉండబోతుందా..? జైలర్, విక్రమ్, లియో, పొన్నియన్ సెల్వన్ అంత పెద్ద హిట్టైనా.. 400, 500 కోట్ల దగ్గరే ఆగిపోడానికి కారణమేంటి..? అన్ని విషయాల్లో బానే ఉన్నా.. ఆ ఒక్క విషయంలో తమిళ సినిమాలు ఫెయిలవుతున్నాయా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5
 ఎందుకు తమిళ సినిమాలు 1000 కోట్ల వైపు వెళ్లట్లేదు.. ఈ అనుమానం చాలా మంది ఆడియన్స్‌కు కూడా వచ్చే ఉంటుంది. తెలుగు, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్.. కోలీవుడ్‌కు ఒక్కటే ఎందుకు సాధ్యం కావట్లేదు..? సింగిల్ లాంగ్వేజ్‌లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు.. 1000 కోట్లు వసూలు చేయకపోవడానికి కారణమేంటని అంతా ఆరా తీస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి.

2 / 5
నిజం చెప్పాలంటే తెలుగు కంటే ముందే తమిళ సినిమాలు 100 కోట్లు, 200 కోట్లు వసూలు చేసాయి. రాజమౌళి కంటే ముందే శంకర్ అక్కడ అద్భుతాలు చేసారు. ఇంత చేసినా కోలీవుడ్‌కు 1000 కోట్లు రాలేదు.

3 / 5
కల్కితో తెలుగు ఇండస్ట్రీ మూడోసారి 1000 కోట్లు రుచి చూస్తే.. పఠాన్, జవాన్‌తో రెండుసార్లు హిందీ.. కేజియఫ్ 2తో ఓసారి కన్నడ ఇండస్ట్రీ 1000 కోట్లు అందుకున్నాయి. ఇంకా మరికొన్ని సినిమాలు కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

4 / 5
 తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి.. ఇందులో నిజం లేకపోలేదు. పొన్నియన్ సెల్వన్ 1 అండ్ 2 కలిపి 700 కోట్లు వసూలు చేసాయి. కానీ ప్యూర్ తమిళ వాసనలున్నందుకే అక్కడ తప్ప మిగిలిన అన్నిచోట్లా అది ఫ్లాప్ అయింది. అందుకే 1000 కోట్లకు దూరంగా ఆగిపోయింది.

5 / 5
ఎక్కడి వరకో ఎందుకు.. విక్రమ్, లియో, జైలర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ హిందీలో కనీస ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే 1000 కోట్లకు దూరమయ్యాయి. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజియఫ్ 2, ఇప్పుడు కల్కి 2898 ఏడి 1000 కోట్లు వసూలు చేయడానికి హిందీ మార్కెట్ కారణం. త్వరలోనే రాబోయే సూర్య కంగువా, విజయ్ గోట్ సినిమాలైనా ఈ గీత చెరిపేసి.. 1000 కోట్లు వసూలు చేస్తాయేమో చూడాలి.