చిక్కుడుకాయ టమాటాలతో ఇలా పప్పు చేశారంటే.. వేడి అన్నం ఉన్న గిన్నె ఖాళీ కావాల్సిందే!

Updated on: Nov 15, 2026 | 11:50 AM

చిక్కుడుకాయ టమాటా పప్పు అనేది ఆంధ్రప్రదేశ్ వంటకాలలో ఒక ప్రత్యేకమైన, పప్పు రెసిపీ. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. చిక్కుడుకాయలతో పప్పు చేసేవారు తక్కువ మంది ఉంటారు, కానీ ఇలా కొత్తగా చేస్తే అందరూ ఇష్టపడతారు. ఈ వంటకంలో వాడే పదార్థాలు తక్కువైనప్పటికీ, రుచి మాత్రం సూపర్ ఉంటుంది.

1 / 5
చిక్కుడుకాయ టమాటా పప్పు అనేది ఆంధ్రప్రదేశ్ వంటకాలలో ఒక ప్రత్యేకమైన, పప్పు రెసిపీ.  దీనిని తయారు చేయడం చాలా ఈజీ. 
చిక్కుడుకాయలతో పప్పు చేసేవారు తక్కువ మంది ఉంటారు, కానీ ఇలా కొత్తగా  చేస్తే అందరూ ఇష్టపడతారు. ఈ వంటకంలో వాడే పదార్థాలు తక్కువైనప్పటికీ, రుచి మాత్రం సూపర్  ఉంటుంది.

చిక్కుడుకాయ టమాటా పప్పు అనేది ఆంధ్రప్రదేశ్ వంటకాలలో ఒక ప్రత్యేకమైన, పప్పు రెసిపీ. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. చిక్కుడుకాయలతో పప్పు చేసేవారు తక్కువ మంది ఉంటారు, కానీ ఇలా కొత్తగా చేస్తే అందరూ ఇష్టపడతారు. ఈ వంటకంలో వాడే పదార్థాలు తక్కువైనప్పటికీ, రుచి మాత్రం సూపర్ ఉంటుంది.

2 / 5
ఒక ప్రెషర్ కుక్కర్‌ను తీసుకొని, అందులో 40 గ్రాముల కందిపప్పు, 25 గ్రాముల ఎర్రపప్పు వేయాలి. పప్పులను కడిగే ముందు కొద్దిగా వేయించడం వల్ల పప్పుకు మరింత రుచి వస్తుంది. ఇది పప్పు ఉడికే విధానాన్ని, సువాసనను మెరుగుపరుస్తుంది. అమ్మమ్మల కాలం నాటి రుచిని కొద్దిగా అయినా తీసుకురావడానికి ఈ చిట్కా సహాయపడుతుంది. పప్పులను బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఆ తరువాత శుభ్రంగా కడగాలి.

3 / 5
కడిగిన పప్పులో సుమారు నీళ్లు పోయాలి. తరువాత కడిగిన చిక్కుడుకాయలు,  టమాటాలు ముక్కలుగా కట్ చేసినవి,  4 పచ్చిమిర్చి, 1  ఉల్లిపాయ 1/4 టీస్పూను పసుపు, 3/4 టీస్పూను కారం వేయాలి. ఇవన్నీ కలిపిన తర్వాత  నీళ్లు కలపాలి.
 కుక్కర్ మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు బాగా ఉడికినా కూడా, చిక్కుడుకాయలు మరీ గుజ్జుగా అవ్వకుండా చూసుకోవాలి. పప్పు కుక్కర్‌లో వేయించినందువల్ల కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా ఉడికించడం ఉత్తమం.

కడిగిన పప్పులో సుమారు నీళ్లు పోయాలి. తరువాత కడిగిన చిక్కుడుకాయలు, టమాటాలు ముక్కలుగా కట్ చేసినవి, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ 1/4 టీస్పూను పసుపు, 3/4 టీస్పూను కారం వేయాలి. ఇవన్నీ కలిపిన తర్వాత నీళ్లు కలపాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు బాగా ఉడికినా కూడా, చిక్కుడుకాయలు మరీ గుజ్జుగా అవ్వకుండా చూసుకోవాలి. పప్పు కుక్కర్‌లో వేయించినందువల్ల కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా ఉడికించడం ఉత్తమం.

4 / 5

కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి, పప్పును పప్పుగుత్తితో తేలికగా మెదపాలి. చిక్కుడుకాయలు నలిగిపోకుండా జాగ్రత్తపడాలి, అవి కొద్దిగా కనపడేలా ఉంటేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ,  10 గ్రాముల చింతపండు నుంచి తీసిన చింతపండు రసం కలిపి, సన్నని మంటపై మరో 5 నిమిషాలు మరగనివ్వాలి. చింతపండు రసం తక్కువగా వాడాలి, లేదంటే పప్పు పుల్లగా అవుతుంది.

5 / 5
పప్పు మరుగుతున్నప్పుడు, మరో పక్క పోపు కోసం ఒక చిన్న పాన్లో 3 టీస్పూన్స్ నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కగానే, 1 టీస్పూను ఆవాలు, 1 టీస్పూను జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత   వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేయించాలి. వెల్లుల్లి రుచి ఈ పప్పుకు చాలా ముఖ్యం, ముఖ్యంగా చిక్కుడుకాయలకు ఉండే ఒకరకమైన వగరు వాసనను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు 1/4 టీస్పూను కంటే కొద్దిగా ఎక్కువ ఇంగువ, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి, వెంటనే పప్పులో కలపాలి.  పోపు కలిపిన తర్వాత, కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. పప్పు చిక్కగా ఉంచుకుంటే వేరే కూరగాయలతో అవసరం ఉండదు. మూత పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచితే పోపు రుచి పప్పుకు బాగా పడుతుంది. ఈ చిక్కుడుకాయ టమాటా పప్పు వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే దాని రుచి అద్భుతంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us