
కావాల్సిన పదార్దాలు : 250 గ్రాముల కోడి లివర్, రెండు కప్పుల ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు ఆకులు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా కోడి లివర్‌ను తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి, కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు ముక్కలు వేసి వేసి బంగారు రంగులోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి. ఇక ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసి వాటిని మెత్తగా అయ్యేదాక బాగా ఉడికించాలి.

కోడి లివర్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి వాటిని బాగా కలపాలి.

ఇక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడి లివర్ ముక్కలు దానిలో కలిపి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఆ తర్వాత చివర్లో మసాలా పొడి , అర కట్ట కొత్తిమీర కూరలో చల్లి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయడమే.