Chicken Feet: అరెరే కోడికాళ్లతో ఇన్ని బెనిఫిట్స్‌ ఉన్నాయా?.. ఇది తెలీక ఇన్నాళ్లు వేస్ట్‌గా పడేశామే!

Updated on: Oct 23, 2026 | 9:32 PM

మన భారత్‌తో సహా చాలా దేశాల్లో కోడి కాళ్లను తినడానికి పనికిరానివిగా.. వాటిని వేస్ట్‌గా పడేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం, వీటిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన ఉంన్నాయని తేలింది. మరీ కోడికాళ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చికెన్ కాళ్లు చర్మం, ఎముకలు, కండరాలు, కనెక్టివ్ టిష్యూలతో నిర్మితమై ఉంటాయి. వీటి నిర్మాణంలో సుమారు 30 నుంచి 35 శాతం కొల్లాజెన్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లతో పాటు కాల్షియం, భాస్వరం, విటమిన్ ఎ, ఫోలేట్ (విటమిన్ బి9) వంటి పోషకాలు కూడా లభిస్తాయి. చెన్నైకి చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ప్రకారం.. చికెన్ కాళ్లలో ఉండే మొత్తం ప్రోటీన్‌లో దాదాపు 70 శాతం కొల్లాజెనే ఉంటుంది అని తెలిపారు.

2 / 5
ఈ కొల్లాజెన్‌ను మన బాడీ త్వరగా గ్రహిస్తుందని.. చర్మం, ఎముకల ఆరోగ్య పరిరక్షణలో ఈ కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చికెన్ కాళ్లలో లభించే కొల్లాజెన్ జెలటిన్ వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలతో పాటు మన చర్మం, కీళ్లు, ఎముకలు, పేగుల ఆరోగ్యానికి తోడ్పడతాయి డాక్టర్ వివరించారు. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిపై జరిపిన పరిశోధనల్లో.. కొల్లాజెన్ తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు, దృఢత్వం తగ్గినట్లు వెల్లడైంది. అంతేకాకుండా వీటిలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు కండరాలు, జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.

3 / 5
తినే సరైన విధానం ఏమిటి?: కోడి కాళ్లను వండే ముందు శుభ్రం చేసుకోవడం అత్యంత కీలకమని డాక్టర్ సూచించారు. వీటిపై మురికి పేరుకుపోయే అవకాశం ఉంటుందని.. సరైన రీతిలో శుభ్రం చేయకుండా తాకితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కేవలం కడగడమే కాకుండా, పై చర్మాన్ని తొలగించి, సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలని.. సరిగ్గా ఉడకకపోతే  సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉండే ఆస్కారం ఉంది అని ఆమె హెచ్చరించారు.

4 / 5
గొర్రె కాళ్ల మాదిరిగానే చికెన్ కాళ్లను కూడా సూప్ రూపంలో తీసుకుంటే బాగుంటుందని ఇండోనేషియా ప్రభుత్వ ఐపీబీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓనో సుపర్నో తన వ్యాసంలో పేర్కొన్నారు. శరీరం సులభంగా గ్రహించేలా చేయడానికి వీటిని సూప్ రూపంలో తయారు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతని తెలిపారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డీప్ ఫ్రై చేయకూడదని.. వేయించిన చికెన్ కాళ్లలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్, సోడియం పరిమాణం పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి తెలిపారు.

5 / 5
ఎవరు, ఎంత మోతాదులో తీసుకోవచ్చు?: చికెన్ కాళ్లలో ఉండే ఫోలేట్ గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయితే దీనిని లిమిట్‌లో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి సగటున 100 నుంచి 150 గ్రాముల సూప్ లేదా గ్రేవీని తీసుకోవచ్చని తెలిపారు. ఇది దాదాపు 4 నుంచి 5 చికెన్ కాళ్లతో సమానమిని తెలిపారు. అయితే పళ్లు రాని చిన్నపిల్లలకు, దంతాలు లేని వృద్ధులకు లేదా మింగడంలో ఇబ్బంది ఉన్నవారికి ఇది ఇవ్వకపోవడమే మంచిదని తెలిపారు. అలాగే వీటిలో కొవ్వు శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నిపుణులు చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us