Chia Seeds: రోజుకు ఒక స్పూన్ చియా విత్తనాలు తిన్నారంటే ఎన్ని లాభాలో..

|

Nov 01, 2023 | 3:39 PM

చియా విత్తనాలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి చిన్నగా చూసేందుకు నలుపు-బూడిద రంగులో ఉంటాయి. ఈ విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చియా విత్తనాలు నానబెట్టిన నీటిని రోజూ తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు. చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోజూ చియా విత్తనాలు ఒక స్పూన్‌ (28 గ్రాముల) చియా విత్తనాలు తింటే..

1 / 5
చియా విత్తనాలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి చిన్నగా చూసేందుకు నలుపు-బూడిద రంగులో ఉంటాయి. ఈ విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చియా విత్తనాలు నానబెట్టిన నీటిని రోజూ తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు.

2 / 5
చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోజూ చియా విత్తనాలు ఒక స్పూన్‌ (28 గ్రాముల) చియా విత్తనాలు తింటే 138 కేలరీలు, 4.7 గ్రాముల ప్రొటీన్, 9.8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అలాగే 1 స్పూన్‌ చియా గింజల్లో 8.6 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

3 / 5
చియా విత్తనాల్లో విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. చియా గింజల్లో జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్‌ కూడా అధికంగా ఉంటాయి.

4 / 5
చియా గింజలు నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల వీటిల్లోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియలో సహాయపడతాయి. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచి బరువు తగ్గేలా చేస్తుంది.

5 / 5
ఈ గింజలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చియా విత్తనాల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా చియా విత్తనాలను తినవచ్చు. చియా విత్తనాల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చక్కెరను విచ్ఛిన్నం చేసి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.