
వానల్లో ఆకు కూరలు తినరు, కానీ వర్షం పడితే ఊరి ప్రజలు ఈ ఆకులను తెచ్చుకుని కూర మంచిగా చేసుకుని ఈజీగా రెండు ప్లేట్స్ లాగిస్తారు. ఇది తింటే ఎన్నో రోగాలు మాయం అవుతాయి. ది బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే. మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

చెంచల కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు : రెండు కట్టలు చెంచల కూర, రెండు ఉల్లిపాయ , 5 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి , అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు , నాలుగు కరివేపాకులు, పసుపు , ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

చెంచల కూర రెసిపీ తయారీ విధానం : ముందుగా మీరు చెంచల కూర బాగా కడిగి నీటిని వంపేయాలి. ఆ తర్వాత దీనిని సన్నగా చిన్న తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

చెంచల కూర రెసిపీ తయారీ విధానం స్టెప్ స్టెప్ 1 : ఆ తరువాత వెల్లుల్లి, నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా పసుపు కూడా బాగా కలపాలి. ఇంకా దీనిలో తరిగిన చెంచల కూర వేసి సరిపడినంత ఉప్పు కూడా వేసి 10 నిమిషాలు పాటు మంటపై ఉంచి దించుకోవడమే.

.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)