
అతి నిద్ర: సమయం సందర్భం లేకుండా నిద్ర పోయే జీవితంలో ఎప్పటికి ఎదగలేరని చాణక్యుడు చెబుతున్నాడు. అంతేకాదు, వీళ్ళు సోమరితనంతో సమాజంలో పేరు కూడా పోగొట్టుకుంటారు.

చెడు స్నేహాలు: మీరు ఎక్కడ ఉన్నా మీ స్నేహాలు మంచిగా ఉండాలి లేదంటే నలుగురిలో నవ్వుల పాలు కాక తప్పదు. ముఖ్యంగా, చెడు స్నేహాలు అస్సలు చేయకండి. దీని వలన మీరు ఎప్పుడూ వెనుకపడే ఉంటారు.

నెగిటివ్ ఆలోచనలు: జీవితంలో ఎప్పుడు ఏ సమస్యలు వస్తాయో ఎవరికి తెలీదు. పరిస్థితులు బాగాలేనప్పుడు నెగెటివ్ గా ఆలోచించకండి దీని వలన చాలా నాశనమవుతారు.

రహస్యాలను చెప్పడం: మీరు ఏం చేస్తున్నారో అనేది ఎప్పటికి ఎవరికి చెప్పకండి. మీ ప్లాన్లు, రహస్యాలు మీలోనే ఉంచుకోండి. వేరే వాళ్లకి చెబితే వారు మిమ్మల్ని ఎదగనివ్వరు.

అతి కోపం: తన కోపమే తన శత్రువు అని ఉరికే అనలేదు. అతి కోపం మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి, కోపాన్ని తగ్గించుకుని జీవించండి.