
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

మంచి వాళ్ళతో స్నేహం మనకి అన్ని విధాలుగా మంచి చేస్తుంది కానీ, చెడ్డ వాళ్లతో సహవాసం ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది. అందువలన, పాముల కంటే ప్రమాదకరమైన వ్యక్తుల స్నేహం అంత మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నారు. మరి వాళ్ళు ఎవరో చూద్దాం

కొంతమంది ప్రతి చోటా తప్పులు వెతుకుతునే ఉంటారు. ఇంకా వీరికి ఎంత మంచి చేసినా కూడా అది పక్కన పెట్టి తప్పులే చూస్తారు. ఇలాంటి వాళ్లకి మీ చుట్టూ ఉన్నా మీరు ఉత్సాహం మొత్తం తగ్గిపోతుంది, ఇంకా మనసుకు ప్రశాంతత కూడా ఉండదు. కాబట్టి, వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదని చాణుక్యుడు చెబుతున్నారు.

అబద్ధాలు చెప్పేవారు : ముఖ్యంగా అబద్దాలు చచెప్పేవారికి కూడా దూరముగా ఉండటం మంచిది. ఏదైనా సరే నమ్మకం మీద నిలబడుతుంది. ఇంకా అబద్ధాలు చెప్పే వారిని నమ్మడం కూడా ప్రమాదకరం. అలాంటి వారిపై ఆధారపడితే చివరకు నష్టమే మిగులుతుంది. కాబట్టి అబద్ధాలు చెప్పే వారికీ దూరంగా ఉండాలి.

కాబట్టి, స్నేహం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కొందరితో స్నేహం చెయ్యకపోవడమే మంచిది (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)