
జీర్ణ సమస్యలు: క్యాలీఫ్లవర్‌లో ఫైబర్, కొన్ని కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా తింటే కొందరికి గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది.

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు: క్యాలీఫ్లవర్‌లో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడటానికి దోహదపడతాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు, వాపులు తీవ్రమవుతాయి.కాబట్టి గౌట్ లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు క్యాలీఫ్లవర్‌ని అధికంగా తీసుకోకపోవడం మంచిది.

థైరాయిడ్ విషయంలో జాగ్రత్త: క్యాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో గోయిట్రోజెన్స్ అనే సహజ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని చాలా ఎక్కువగా తీసుకోవడం థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు. అయితే సాధారణ పరిమాణంలో వండుకుని తీసుకోవడం చాలామందికి ఎలాంటి సమస్య ఏర్పడదు.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు: క్యాలీఫ్లవర్‌లో ఆక్సలేట్లు కూడా ఉంటాయి. ఇప్పటికే కొన్ని రకాల కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు ఆహారంలో ఆక్సలేట్ల పరిమాణంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల వైద్యులు లేదా డైటీషియన్ సూచన మేరకు తీసుకోవడం మంచిది.

ఎలా తింటే మంచిది?: క్యాలీఫ్లవర్‌ని శుభ్రంగా కడిగి, తగినంతగా ఉడికించి లేదా వండుకుని తీసుకోవడం మంచిది. అయితే ఎక్కువసేపు ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అతిగా ఉడికించకుండా సరైన పద్ధతిలో వండుకోవడం ఉత్తమం.

గమనిక: క్యాలీఫ్లవర్ పూర్తిగా హానికరమైన ఆహారం కాదు. మితంగా తీసుకుంటే ఇది పోషకాలు అందించే ఆరోగ్యకరమైన కూరగాయ. ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వ్యక్తిగత వైద్య సలహాను పాటించాలి.