Hair Loss Tips: జుట్టు ఊడిపోతోందా ?? మార్చాలిసింది షాపు కాదు.. మీ ఫుడ్ డైట్

Updated on: May 28, 2026 | 7:58 PM

 ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. జుట్టు ఊడిపోతుండగానే మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, నూనెలు మార్చేస్తుంటాం. కానీ, అసలు సమస్య మన శరీరానికి అందే పోషకాహార లోపం వల్ల కూడా కావచ్చు అని చాలా మంది గమనించరు. మనం తీసుకునే రోజువారీ ఆహారానికి, మన జుట్టు ఆరోగ్యానికి చాలా బలమైన సంబంధం ఉంది.

1 / 5
శరీరంలో విటమిన్ బి12, విటమిన్ డి, మరియు ఐరన్ వంటి పోషకాలు తగ్గినప్పుడు జుట్టు విపరీతంగా రాలడం ప్రారంభమవుతుంది. కేవలం అన్నం, పప్పు తింటేనే సరిపోదు, జుట్టు వేర్లకు బలాన్నిచ్చే సూక్ష్మ పోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) మన డైట్‌లో ఉండటం చాలా ముఖ్యం. జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి ప్రోటీన్లు ఎంతో అవసరం. మన జుట్టు 'కెరటిన్' అనే ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటుంది. కాబట్టి, మన శరీరానికి సరిపడా అమైనో ఆసిడ్స్ అందించే ఆహారాన్ని తీసుకోవాలి.

2 / 5
ఇందుకోసం మొలికెత్తిన గింజలు (స్ప్రౌట్స్) అద్భుతంగా పనిచేస్తాయి. పెసలు, పల్లీలు లేదా శనగలను నానబెట్టి మొలకలు వచ్చాక తింటే వాటిలో అత్యధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అలాగే సోయాబీన్ చంక్స్ కూడా ప్రోటీన్లకు మంచి వనరు. శాకాహారులకు ఇవి 'పేదవాడి మాంసం' (Poor man's meat) లాంటివి. అయితే, థైరాయిడ్ సమస్య ఉన్నవారు సోయాబీన్‌ను కాస్త తక్కువగా తీసుకోవడం మంచిది.

3 / 5
శరీరానికి కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. ఒకవేళ పాలు పడని వారు (లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదా గ్యాస్ సమస్య ఉన్నవారు) రాగి మాల్ట్ లేదా రాగి జావను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. వీటితో పాటు, రోజువారీ డైట్‌లో 'గ్రీన్ సలాడ్స్' చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి పచ్చి కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజువారీ ఒత్తిడి (స్ట్రెస్) వల్ల జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే దానిమ్మ, ఆరెంజ్, డ్రాగన్ ఫ్రూట్ వంటి రంగురంగుల పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు జీవాన్నిస్తాయి.

4 / 5
ఇక మాంసాహారుల విషయానికి వస్తే, కేవలం చికెన్, మటన్ బిర్యానీలు మాత్రమే కాకుండా మటన్ లివర్ (కాలేయం) వారంలో లేదా నెలలో ఒకసారి తీసుకోవడం చాలా మంచిది. కేవలం 150 గ్రాముల మటన్ లివర్ తింటే, శరీరానికి నెల రోజులకు సరిపడా విటమిన్ బి12 మరియు ఐరన్ లభిస్తాయి. అలాగే చేపలు (ఫిష్) జుట్టు ఆరోగ్యానికి ఒక వరం లాంటివి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు సహజసిద్ధమైన కొలాజన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తాయి.

5 / 5
చివరగా, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఉన్న జుట్టును కాపాడుకోవచ్చు మరియు జుట్టు నాణ్యతను పెంచుకోవచ్చు. ఒకవేళ హార్మోన్ల లోపం లేదా బట్టతల (జెనెటిక్ హెయిర్ లాస్) సమస్య ఉంటే కేవలం డైట్ తోనే జుట్టు తిరిగి రాదు. అలాంటప్పుడు నిపుణులైన డర్మటాలజిస్ట్‌ను కలిసి పిఆర్పి (PRP), జిఎఫ్సి (GFC) వంటి చికిత్సలు తీసుకోవాలి. కానీ ఆ చికిత్సలు తీసుకుంటున్నప్పుడు కూడా సరైన పోషకాహారం తింటేనే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని గుర్తుంచుకోండి.

Follow Us