
మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాపులు నేటి కాలంలో ఎంతో మంది బాధ పడుతున్నారు. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ప్రకృతి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. క్యాబేజీని సాధారణంగా ఆహారంలో భాగంగా తీసుకుంటాం, దాని పోషక విలువల కూడా మనకు తెలుసు. అయితే, క్యాబేజీని ఔషధంగా మోకాళ్ళ నొప్పులకు ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కీర దోసకాయలను కళ్ళపై పెట్టుకున్నప్పుడు ఎలా ఉపశమనం లభిస్తుందో, అదే విధంగా క్యాబేజీ ప్యాక్‌ను మోకాళ్ళపై పెట్టుకోవడం ద్వారా నొప్పి మరియు వాపుల నుండి గొప్ప ఉపశమనం పొందవచ్చని అంటున్నారు. క్యాబేజీలో "ఎంఆర్ఎన్ఏ" అనే ఒక ప్రత్యేక రసాయన సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం మోకాళ్ళ నొప్పుల ఉపశమనంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మోకాళ్ళపై క్యాబేజీ ప్యాక్‌ను ఉంచినప్పుడు, ఎంఆర్ఎన్ఏ నేరుగా చర్మం ద్వారా మోకాళ్ళ లోపలికి చేరుకుంటుంది. ఇంకా మోకాళ్ళ వద్ద కార్టిలేజ్‌ను దెబ్బతీసే "ఫ్యాన్ ప్రొటీన్" అనే హానికరమైన ప్రొటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ కారణంగానే మోకాళ్ళ వద్ద శబ్దాలు వస్తాయి, కార్టిలేజ్ అరిగిపోతుంది. క్యాబేజీలోని ఎంఆర్ఎన్ఏ ఈ "ఫ్యాన్ ప్రొటీన్"ను నాశనం చేయడంలో సహాయపడుతుంది, ఆ తరవాత కార్టిలేజ్‌ను రక్షిస్తుంది.

ఈ క్యాబేజీ ప్యాక్ అనేక విధాలుగా మోకాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మోకాళ్ళ భాగంలో వచ్చే వాపును సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రభావిత ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది వేగవంతమైన రికవరీకి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా కీళ్ల వద్ద ఉండే మంటను పూర్తిగా నియంత్రిస్తుంది. ఎంఆర్ఎన్ఏ ప్రొటీన్ వలన నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

క్యాబేజీ ప్యాక్‌ను ఎలా చేయాలంటే? మొదట, క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసి, గ్రైండర్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మోకాళ్ళ పైభాగం అంతటా దట్టంగా అప్లై చేయాలి. పేస్ట్ పడిపోకుండా ఉండటానికి, దానిపై కొన్ని తాజా క్యాబేజీ ఆకులను కప్పాలి. చివరగా, ఒక శుభ్రమైన గుడ్డతో లేదా బ్యాండేజ్‌తో మోకాళ్ళ చుట్టూ చుట్టి ప్యాక్‌ను స్థిరంగా ఉంచాలి. ఈ ప్యాక్‌ను సుమారు 30 నుండి 45 నిమిషాల పాటు ఉంచాలి. ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా రోజుకొకసారి ఈ ప్యాక్‌ను వేసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, వాపుల నుంచి మీకు ఉపశమనం దొరుకుతుంది.