Yamaha Xenter E: 108 కిలోమీటర్ల రేంజ్‌తో యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!

Updated on: Nov 17, 2026 | 8:26 AM

Yamaha Xenter E: కంపెనీ ఈ వాహనాన్ని రోజువారీ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించింది. వాహనం మైలేజీని పెంచడానికి ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు..

1 / 5
 Yamaha Xenter E: కంపెనీ ఈ వాహనాన్ని రోజువారీ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించింది. డిజైన్ పరంగా దీని ముందు భాగంలో చతురస్రాకారపు హెడ్‌ల్యాంప్, సన్నని, నిటారుగా ఉండే ఏప్రాన్ డిజైన్ ఉన్నాయి.

2 / 5
 సాధారణ స్కూటర్లలో లాగానే, దీని ఫ్లోర్‌బోర్డ్ కూడా రోజువారీ వాడకానికి, ఇతర అవసరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ వాహనానికి అంచెల వారీగా సీటు మోడల్‌ను అందించింది. దీనికి అదనంగా అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్ ఈ స్కూటర్‌కు మరింత ప్రీమియం రూపాన్ని ఇస్తుంది.

3 / 5
 యమహా క్సెంటర్ పెద్ద 16-అంగుళాల వీల్స్‌పై నడుస్తుంది. దీని సస్పెన్షన్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు షాక్ అబ్జార్బర్‌లతో కూడిన స్వింగ్‌ఆర్మ్ ద్వారా అందించింది. దీనికి ఇరువైపులా 245 మిమీ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి.

4 / 5
 యమహా క్సెంటర్ E 3-ఫేజ్ ఎక్సైటేషన్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది 7.5 kW గరిష్ట శక్తిని, 33.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌కు 70.2 Ah సామర్థ్యం గల ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తి అందుతుంది. ఈ వాహనం ఒకే ఛార్జ్‌పై 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

5 / 5
 వాహనం మైలేజీని పెంచడానికి ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us