Gold Prices: బంగారంపై సీన్ రివర్స్.. మారిన ప్రజల మూడ్.. దానికి బదులు ఏం కొంటున్నారంటే..?

Updated on: Dec 31, 2025 | 8:52 PM

బంగారం రేట్లు 2025లో కొనుగోలుదారులకు చుక్కలు చూపించాయి. చరిత్రలో ఎన్నడూ పెరగనంతగా రికార్డ్ స్థాయిలో పెరిగాయి. దీంతో ప్రజల మైండ్ సెట్ కూడా మారింది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం మానేసి వేరే మార్గంలో గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు. ఆ వివరాలు..

1 / 5
బంగారం రేట్లు పెరగడంతో కొనుగోలు విషయంలో ప్రజల అభిప్రాయం మారుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారంపై రికార్డ్ స్థాయిలో 40 శాతం పెట్టుబడులు పెరిగాయని, 2025 మొదటి తొమ్మిది నెలల్లో ఇండియాలో మొత్తం బంగారం డిమాండ్ 14 శాతం తగ్గిందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

2 / 5
ఇప్పటివరకు ఈ ఏడాదిలో గోల్డ్ రేట్లు 67 శాతం పెరిగాయి. డిసెంబర్ 26న ఔన్సుకు రికార్డు స్థాయిలో 4,59.7 డాలర్లకు చేరుకుంది. ఇక భారదేశంలో గోల్డ్ రేట్లు  77 శాతం పెరగ్గా.. నిఫ్టీ ఇండెక్స్ 9.7 శాతం లాభాన్ని అధిగమించింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 శాతం తగ్గడం ఇందుకు తోహదపడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

3 / 5
బంగారు ఆభరణాలకు బదులు గోల్డ్ కాయిన్స్, కడ్డీలను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు.  ఆభరణాలకు డిమాండ్ తగ్గగా.. బంగారంలో పెట్టుబడి పెరిగింది. చిన్న నాణేలు, కడ్డీల వైపు ప్రజలు మోగ్గు చూపుతున్నారు. అలాగే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో గోల్డ్‌పై పెట్టుబడులు పెరుగుతున్నాయి.

4 / 5
ఇండియాలో పండుగలు, పెళ్లిళ్ల సమయంలో తప్పనిసరిగా గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక పండుగల సమయంలో బంగారం కొనడాన్ని శుభప్రదంగా భారతీయులు నమ్ముతారు. అయితే 2025లో బంగారం ధరలు భారీ ర్యాలీ కారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు తగ్గిపోయారు. అసలే ధరలు పెరగడంతో పాటు మేకింగ్ ఛార్జీలు అధికం అవ్వడం వల్ల బంగారం సేల్స్ తగ్గిపోతున్నాయి.

5 / 5
బంగారం ధరలు 2025లో రికార్డు స్థాయిలో పెరిగాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేట్లు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ట్రంప్ సుంకాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం వంటి కారణాల వల్ల పసిడి ధరలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో బంగారం సేల్స్ భారీగా తగ్గిపోయాయి.