Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయం ఆలోచించుకోండి.. లేకపోతే భారీగా లాస్ అవుతారు

Updated on: Aug 04, 2026 | 2:54 PM

చాలామంది ఎప్పటినుంచో ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేస్తూ ఉంటారు. అవసరం లేదనుకుని వాటిని మూసివేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఎలాంటి సమయంలో సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుందనేది చూద్దాం.

1 / 5
చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వాడుతూ ఉంటారు. ఎక్కవ అకౌంట్లను నిర్వహించడం భారంతో కూడుకున్న పని. ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు పెనాల్టీలు విధిస్తూ ఉంటాయి. దీంతో కొంతమంది ఈ ఛార్జీలను చెల్లించలేక పాత బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఎప్పటినుంచో వాడుతున్న క్రెడిట్ కార్డులను కూడా మూసివేస్తూ ఉంటారు.

2 / 5
అయితే పాత బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను మూసివేయడం వల్ల సిబిల్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావం పడుతుందనే వార్తలు మనం వింటూ ఉంటాం. పాత బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుందా..? తగ్గుతుందా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. ఇలాంటి పని చేసినప్పుడు ఖచ్చితంగా సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత ప్రభావం పడుతుందనేది మీ మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది

3 / 5
కార్డును క్లోజ్ చేయడం వల్ల అందుబాటులో ఉన్న మీ మొత్తం క్రెడిట్ తగ్గిపోతుంది. మీ పెండింగ్ బకాయి అలాగే ఉంటే మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. దీనిని రుణాలు ఇచ్చే ఆర్ధిక సంస్థలు అనుకూలంగా చూడవని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.3 లక్షలు ఉండి బకాయి రూ.60 వేలు ఉంటే.. మీ క్రెడిట్ వినియోగం 20 శాతంగా ఉంటుంది.

4 / 5
మీరు రూ.లక్ష లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు మూసివేస్తే రూ.2 లక్షలకు క్రెడిట్ తగ్గిపోతుంది. అప్పుడు మీ వినియోగం 30 శాతానికి పెరుగుతుంది. చాలాకాలంగా ఉపయోగిస్తున్న కార్డును మూసివేయడం వల్ల క్రెడిట్ హిస్టరీ వల్ల కలిగి ప్రయోజనం కూడా తగ్గుతుంది. అయితే సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ లాంటివి మూసివేయడం వల్ల సిబిల్‌పై ప్రభావం పడదు. అయితే మీ బ్యాంక్ అకౌంట్ లోన్ ఈఎంఐలు, ఆటో మ్యాండేట్ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులకు లింక్ అయి ఉంటే ప్రభావం పడుతుంది.

5 / 5
బ్యాంక్ అకౌంట్ మూసివేసే ముందు అన్ని స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌లు పరిశీలించుకోండి. ఆటో డెబిట్ మాండేట్‌లు మరొక యాక్టివ్ ఖాతాకు విజయవంతంగా బదిలీ చేసుకోండి. ఇక పాత క్రెడిట్ కార్డును మూసివేస్తే మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోవచ్చు. ఇలాంటి సమయంలో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. ఆ కార్డుకు వార్షిక రుసుము లేకపోతే దానిని అప్పుడప్పుడు వాడుతూ యాక్టివ్‌గా ఉంచుకోవడమే మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us