Indian Railways: జనరల్ కోచ్‌లు ట్రైన్ ముందు, వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..? ఈ సింపుల్ రీజన్ చాలామందికి తెలిసి ఉండదు..

Updated on: Sep 13, 2026 | 8:52 AM

జనరల్ కోచ్‌లను చూస్తే ట్రైన్ ముందు,. వెనుక భాగంలో ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఇందుకు స్పష్టమైన నిబంధనలు అంటూ ఏమీ లేవు. కేవలం ప్రయాణికుల రద్దీ నియంత్రణ, భద్రత కోసం ఇలా అమర్చుతారు. దీని వెనుక రీజన్ ఏంటంటే..

1 / 5
రైళ్లల్లో ప్రయాణించనివారంటూ ఎవరూ ఉండరు. ఒక్కసారైనా ట్రైన్‌లో జర్నీ చేసి ఉంటారు. దూరపు ప్రాంతాలకు వెళ్లేవారు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే రైళ్లల్లో అనేక కేటగిరీ క్లాస్‌లు ఉంటాయి. జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌ల అమరిక అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏసీ, స్లీపర్ బోగీలు మధ్యలో ఉంటే.. జనరల్ కోచ్‌లు రైలు ముందు, వెనుక భాగంలో ఉంటాయి. జనరల్ కోచ్‌లు ముందు లేదా వెనుక భాగంలోనే ఎందుకు ఉంటాయనే అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది.

2 / 5
జనరల్ కోచ్‌లను రైలు మధ్యలో ఉంచితే.. ఫ్లాట్‌ఫామ్‌పై ఒకేచోట భారీగా జనం చేరే పరిస్థితి ఉంటుంది. అదే ముందు, వెనుక భాగంలో ఉంచడం వల్ల ప్రయాణికుల రద్దీని వేర్వేరు ప్రాంతాల్లోకి విభజించినట్లు అవుతుంది. దీని వల్ల తొక్కిసలాటలు వంటివి చోటుచేసుకోవు. స్లీపర్, ఏసీ కోచుల్లోకి ఎక్కేవారికి కూడా అసౌకర్యం ఉండదు. ఫ్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుల కదలికలను క్రమబద్దీకరించడంలో ఇది సహాయపడుతుంది.

3 / 5
ఫ్లాట్ ఫామ్ మధ్యభాగంలో స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉండటం వల్ల బోర్డింగ్ సమయంలో గందరగోళం తగ్గుతుంది. వృద్దులు, పిల్లలు రిజర్వుడ్ కోచ్‌లకు సులభంగా చేరుకోవచ్చు. అంతేకాకుండా ఒకే ప్రాంతంలో ఎక్కుమంది ప్రయాణికులు ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నియంత్రించడం కష్టతరం అవుతుంది. అదే ఇలా విభజించడం వల్ల వేగంగా చర్యలు చేపట్టవచ్చు.

4 / 5
స్టేషన్ నిర్వహణ, భద్రత కోసమే జనరల్ బోగీలను రైలు ముందు, వెనుక భాగంలో అమర్చుతారు. అయితే ప్రతీ రైలులో కోచ్‌ల అమరిక అనేది ఒకేలా ఉండదు. కొన్ని రైళ్లలో వేరేచోట ఉండవచ్చు. దీంతో మీరు ప్రయాణం చేసే సమయంలో స్టేషన్‌లో డిస్‌ప్లే బోర్డులు, కోచ్ పొజిషన్ సూచనలను పాటించండి.

5 / 5
అయితే దీని వెనుక పెద్ద రీజన్ ఉంది. ట్రైన్ సేఫ్టీ, ప్రయాణికుల భద్రత కోసమే అలా ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశంతో జనరల్ కోచ్‌లను ముందు, వెనుక భాగంలో అమర్చుతారు. జనరల్ బోగీల్లో ఎక్కువ రష్ ఉంటుంది. నాన్ రిజర్వుడు కోచ్‌లు కావడంతో ఎంతమంది అయినా ఎక్కవచ్చు. దీంతో నిరంతరం కిటకిటలాడుతూ ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us