
అన్ని మొబైల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సిమ్ ఉపయోగించుకునే ఫీచర్ ఉంటుంది. దీంతో ఎక్కువమంది ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లను తమ ఫోన్లో వేసుకుంటారు. ఒక సిమ్‌ను పర్మినెంట్ నెంబర్‌గా ఉపయోగించుకుంటే.. మరో నెంబర్‌ను అల్టర్నేటివ్ నెంబర్ కింద వినియోగించుకుంటారు. ఇతర అవసరాలు, ఓటీపీల కోసం సెకండ్ నెంబర్ వాడుకుంటారు.

రెండో సిమ్‌తో ఎక్కువ పని లేకపోయినా రీఛార్జ్ చేయాలంటే సామాన్యులకు ఆర్ధిక భారంతో కూడుకున్నది. ప్రస్తుతం రీఛార్జ్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో రెండు సిమ్‌లను వినియోగించాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో వ్యాలిడిటీ అయిపోయినా సెకండ్ సిమ్‌కు రీఛార్జ్ చేయరు. 90 రోజులైన మీరు రీఛార్జ్ చేయకపోతే సిమ్ ఆటోమేటిక్‌గా టెలికాం నిబంధనల ప్రకారం డీయాక్టివేట్ అవుతుందనే విషయం తెలిసిందే.

అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. మీ నెంబర్‌పై రూ.20 కనీస బ్యాలెన్స్ ఉంటే సిమ్ డీయాక్టివేట్ అవ్వదు. ఈ కొత్త నిబంధనల ప్రకారం 90 రోజుల తర్వాత మీ సిమ్ కార్డులో రూ.20 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే అది ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దీని వల్ల మరో 30 రోజుల పాటు సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. మీ సిమ్ కార్డుపై రూ.20 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నన్ని రోజులు ఇలా యాక్టివ్‌గా ఉంచుకోచ్చు.

మీ బ్యాలెన్స్ రూ.20 కంటే తక్కువకు పడిపోయినప్పుడు మీ సిమ్ డీయాక్టివేట్ అవుతుంది. డీయాక్టివేట్ అయిన 15 రోజుల్లోగా రూ.20 రీఛార్జ్ చేయడం ద్వారా మీ సిమ్ మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఈ సౌకర్యం ప్రీపెయిడ్ కనెక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. తమ సిమ్‌లను అరుదుగా ఉపయోగించుకునేవారు ఈ పని చేయడం వల్ల ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చన్నమాట.

సిమ్ కార్డులో బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు దాగి ఉంటాయి. దీంతో వినియోగదారులకు ఊరట కల్గించేందుకు ట్రాయ్ ఈ నిబంధన గతంలోనూ తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమ సిమ్ కార్డులను కాపాడుకోవచ్చు. గతంలో మినిమం రూ.149, రూ.199 లాంటి మినిమం రీఛార్జ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు.