పొరపాటున అకౌంట్‌లోకి రూ. 40 కోట్లు.. 20 నిమిషాల్లో రూ. 1.75 కోట్ల లాభం.. కట్‌చేస్తే..!

Updated on: Jan 06, 2026 | 1:28 PM

Stock Market Profit: ట్రేడింగ్ ప్రపంచంలో అప్పుడప్పుడు జరిగే సాంకేతిక పొరపాట్లు కొందరికి శాపంగా, మరికొందరికి వరంగా మారుతుంటాయి. కోటక్ సెక్యూరిటీస్ పొరపాటున ఒక ట్రేడర్ ఖాతాలోకి పంపిన భారీ మొత్తం, అతనికి కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఆ లాభం ఎవరికి చెందాలనే విషయంలో జరిగిన సుదీర్ఘ చట్టపరమైన పోరాటంలో చివరకు ట్రేడర్‌కే విజయం లభించింది.

1 / 5
Stock Market Profit: స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన, అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోటక్ సెక్యూరిటీస్ చేసిన ఒక చిన్న పొరపాటు, ఒక సామాన్య ట్రేడర్‌ను కోటీశ్వరుడిని చేయడమే కాకుండా, చట్టపరమైన చర్చకు దారితీసింది.

2 / 5
కోటక్ సెక్యూరిటీస్ పొరపాటున ఒక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడర్ ఖాతాలోకి రూ. 40 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. తన ఖాతాలో ఉన్న ఈ భారీ మొత్తాన్ని చూసిన సదరు ట్రేడర్, దానిని పెట్టుబడిగా పెట్టి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ. 2.38 కోట్ల లాభాలను ఆర్జించాడు. అయితే, తొలుత రూ. 54 లక్షల నష్టాన్ని చవి చూశాడు. చివరకు మరోసారి ట్రేడ్ చేసి ఏకంగా ఆ నష్టాన్ని భర్తీ చేసి రూ. 1.75 కోట్ల నికర లాభం పొందాడు.

3 / 5
ఈ విషయాన్ని గుర్తించిన కోటక్ సెక్యూరిటీస్, ఆ రూ. 40 కోట్లతో పాటు ట్రేడర్ సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభాన్ని కూడా తిరిగి తీసుకుంది. అయితే, ఆ లాభం తన కష్టార్జితమని, తన తెలివితేటలతో ట్రేడింగ్ చేసి సంపాదించానని సదరు ట్రేడర్ కోర్టును ఆశ్రయించాడు. అతని అభ్యర్థనను (Plea) న్యాయస్థానం రెండుసార్లు తిరస్కరించింది. కానీ, అతను పట్టువదలకుండా అప్పిలేట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్‌ను (Appellate Arbitral Tribunal) ఆశ్రయించాడు.

4 / 5
అన్ని వాదనలు విన్న అప్పిలేట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ చివరకు కీలక తీర్పునిచ్చింది. సంస్థ పంపిన అసలు మొత్తాన్ని తిరిగి తీసుకోవడం సరైనదే అయినప్పటికీ, ఆ డబ్బుతో ట్రేడర్ తన సొంత రిస్క్‌తో సంపాదించిన లాభం అతనికే చెందుతుందని పేర్కొంది. దీంతో ఆ రూ. 1.75 కోట్ల లాభాన్ని ఉంచుకోవడానికి ట్రేడర్‌కు అనుమతి లభించింది.

5 / 5
ఈ తీర్పు ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బ్రోకింగ్ సంస్థలు తమ సిస్టమ్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన గుర్తుచేస్తోంది.