Silver Prices: హమ్మయ్యా.. వెండి ధరలు భారీగా ఢమాల్.. నాలుగో రోజు కూడా.. ఒకేసారి ఎంతంటే..?

Updated on: Jul 09, 2026 | 4:22 PM

సిల్వర్ ధరలు భారీగా డౌన్ అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా క్రాష్ అవుతూనే ఉన్నాయి. బంగారంతో పోలిస్తే వెండి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. వెండిని పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతల సమయంలో వెండిలో భారీ మార్పులు జరుగుతాయి.

1 / 5
పసిడి ధరలు మళ్లీ దిగొస్తు్న్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పడిపోయాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేయడం, ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటన చేయడంలో గురువారం బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారంతో పాటు పోలిస్తే వెండి ధర భారీగా పతనమైంది. గల్ప్ దేశాల్లో అమెరికా స్ధావరాలపై ఇరాన్ దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.

2 / 5
మళ్లీ అంతర్జాతీయంగా యుద్ద పరిస్థితులు నెలకొనడంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగతోంది. ఈ ప్రభావం వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. వెండిని వస్తువుల తయారీ కోసమే కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా వినియోగిస్తారు. దీంతో వెండి ఎక్కువగా అంతర్జాతీయ పరిణామాలకు ప్రభావితం అవుతూ ఉంటుంది. దీంతో వెండి ధరల్లో తరచుగా ఒడిదొడుకులు ఎక్కువగా చోటుచేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో గత నాలుగు రోజుల్లో వెండి ధరలు భారీగా కుప్పకూలాయి.

3 / 5
గత నాలుగు రోజుల్లో వెండి ధరలు సుమారు రూ. 15 వేల మేర డౌన్ అయ్యాయి.  ఇవాళ కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ. 10,000 తగ్గి రూ. 2,35,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌(MCX)లో సెప్టెంబర్ 2026 డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోగ్రాముకు రూ. 2 వేలు తగ్గి రూ. 2,21,502కి చేరుకున్నాయి. గురువారం సిల్వర్ ధరలు ఒకేసారి రూ.10 వేలు తగ్గాయి.

4 / 5
గురువారం భారత బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ ఏకంగా రూ.10 వేల మేర పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.2.35 లక్షలకు చేరుకున్నాయి.

5 / 5
ముడి చమురు ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు, డాలర్ సూచీలో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ వారం వెండి ధరల్లో భారీగా ఒడిదొడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత స్థాయిలలో వెండిని కొనుగోలు చేసేందుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వారం తర్వాత వెండి ధరలు ఎలా ఉంటాయనే అంచనాకు రావొచ్చని చెబుతున్నారు.

Follow Us