
ప్రస్తుతం పసిడి ధరలు భారీగా పడిపోతున్నాయి. గత కొద్ది నెలలుగా బంగారం, వెండి ధరలు దిగజారుతూ కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తున్నాయి. పండుగల సీజన్ క్రమంలో ధరలు దిగిరావడం ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తున్న వేళ పసిడి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ధరలు తగ్గుముఖం పడుతుండటం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేసే అవకాశముంటుందని చెప్పవచ్చు.

బంగారంతో పాటు వెండి ధరలు భారీగా కుప్పకూలుతున్నాయి. జనవరిలో కిలో సిల్వర్ ఏకంగా రూ.4.25 లక్షలకు చేరుకుని చరిత్రలో ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకోగా.. ఆ తర్వాత ఒక్కసారిగా ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. జనవరి 29న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.45 లక్షలు పలకగా.. అక్టోబర్ 23న రూ.2.25 లక్షల వద్ద కొనసాగుతోంది. అంటే 9 నెలల్లో ఏకంగా రూ.2 లక్షల మేర క్రాష్ అయింది.

సిల్వర్ ధరలు డౌన్ అవుతుండటంతో చాలామంది కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ధరల పతనం ఇలాగే కొనసాగే అవకాశముందనే అంచనాలతో మరికొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పండుగల సమయంలో పూజా సామాగ్రి, దేవుడి ప్రతిమలు, కాయిన్స్ రూపంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. వారికి ధరల తగ్గుదల ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

గత 10 రోజుల్లో వెండి ధరలు బాగా తగ్గాయి. అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్లో కేజీ సిల్వర్ రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. 15వ తేదీకి రూ.2.40 లక్షలకు చేరుకుంది. ఇక అక్టోబర్ 21 నాటికి రూ.2.30 లక్షలకు చేరుకోగా.. అక్టోబర్ 22న రూ.2.25 లక్షల వద్ద ఉండగా.. 23న కూడా అదే ధర పలుకుతోంది.

బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తే.. వెండిని పూజా సామాగ్రి, దేవుడి ప్రతిమల రూపంలో ఎక్కువగా కొనుగోలు చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇక వెండిని పారిశ్రామిక అవసరాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, విద్యుత్ రంగంలో వెండిని విరివిగా వాడతారు.