RBI: ఈఎంఐలు చెల్లించేవారికి బ్యాడ్ న్యూస్.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం..! ఇక కష్టమే..

Updated on: Oct 25, 2026 | 1:19 PM

లోన్ తీసుకున్నవారికి ఆర్బీఐ మరో షాకిచ్చే యోచనలో ఉంది. ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈఎంఐలు చెల్లించేవారికి షాక్ తగిలినట్లయింది. అయితే రాబోయే రోజుల్లో మరోసారి వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దమవుతున్నట్లు అంచనాలు వస్తున్నాయి.

1 / 5
లోన్లు తీసుకున్నవారికి ఆర్బీఐ మరో షాక్ ఇవ్వనుందా..? త్వరలో ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ద్రవ్య విధాన పరపతి సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే  ఫిబ్రవరి 2027 నాటికి వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణాలు ఏంటో చూద్దాం.

2 / 5
వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశముందని ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. ఈ మేరకు తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ నివేదికలో ఆ అంశాన్ని పొందుపర్చింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో వడ్డీ రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని నివేదికలో పేర్కొంది.

3 / 5
ఆర్బీఐ అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో 5.25 శాతం నుంచి 5.50 శాతానికి వడ్డీ రేట్లు చేరుకున్నాయి. దీని వల్ల బ్యాంకులు ఇటీవల వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో లోన్లు చెల్లించేవారికి నెలవారీ ఈఎంఐలు పెరిగాయి. కొత్తగా లోన్ తీసుకునేవారికి కూడా అధిక వడ్డీ రేట్లు పడుతున్నాయి. ఇది సామాన్యులపై భారాన్ని మోపుతోంది.

4 / 5
ప్రస్తుతం దేశంలో దిగుమతి వ్యయాలు పెరగడంతో పాటు ప్రపంచ ఆర్ధిక పరిణామాల క్రమంలో దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉంటుంది. దీంతో ద్రవ్యలోటును నియంత్రించేందుకు, ధరల స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయనుంది. ద్రవ్యల్బణాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

5 / 5
వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఫ్లోటింగ్ రేటుపై హోం లోన్, ఇతర రుణాలు తీసుకున్నవారికి ఈఎంఐ పెరుగుతుంది. ఖాతాదారులు ఈఎంఐ పెంచుకోవడం లేదా లోన్ చెల్లింపు కాలంలో మార్పులు చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఎక్కువగా హోమ్ లోన్లు ఫ్లోటింగ్ రేటుతో ఉంటాయి. దీంతో ఈ లోన్లు తీసుకున్నవారిపై భారం పడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us