వారెవ్వా.. కేవలం రూ.7 వేలతో రూ.12 లక్షలు సంపాదించొచ్చు.. అది ఎలాగో తెలిస్తే అవాక్కవడం పక్కా..

Updated on: Jan 26, 2026 | 2:52 PM

Post Office: ఈ మధ్య కాలంలో పోస్టాఫీస్ పథకాల్లో ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. రిస్క్ లేని పెట్టుబడి, మంచి స్కీమ్స్, ప్రభుత్వం హామీ ఉండడమే దీనికి కారణం. అటు పోస్టాఫీస్ సైతం మధ్యతరగతి, సామాన్య ప్రజల కోసం అద్భుతమైన పొదుపు పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వేదికగా మారింది. క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును పెంపొందించడమే కాకుండా దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని వెనకేసుకునే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది.

1 / 5
పోస్టాఫీస్ RDలో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. మీరు మీ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎంత మొత్తమైనా పొదుపు చేయవచ్చు. కేవలం రూ.100 తోనే ఈ ఖాతాను ప్రారంభించే వెసులుబాటు ఉండటం విశేషం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ మీ సంపదను పెంచుకోవచ్చు.

2 / 5
 ప్రాథమికంగా RD కాలపరిమితి 5 సంవత్సరాలు. వినియోగదారుడు కోరుకుంటే దీనిని మరో రెండు పర్యాయాలు (మొత్తం 15 సంవత్సరాల వరకు) పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం పోస్టాఫీస్ RDలపై 6.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత మీ పెట్టుబడిలో 50 శాతం వరకు రుణంగా పొందే సదుపాయం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మెచ్యూరిటీకి ముందే ఖాతాను మూసివేసే అవకాశం కూడా ఉంది.

3 / 5
మీరు నెలకు రూ. 7,000 చొప్పున పొదుపు చేస్తే, కాలక్రమేణా అది భారీ నిధిగా మారుతుంది. మీరు 5 ఏళ్లలో పెట్టుబడి రూ. 4,20,000 అయితే దానిపై  రూ. 79,564 వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 4,99,564 అవుతుంది. అదే పదేళ్లకు చూసుకుంటే మీ పెట్టుబడి రూ. 8,40,000 అయితే దానిపై రూ.3,55,982 వడ్డీ వస్తుంది. అంటే మీ చేతికి రూ. 11,95,982 వస్తుంది.

4 / 5
మీరు 10 సంవత్సరాల పాటు ఈ పొదుపును కొనసాగిస్తే దాదాపు రూ.12 లక్షల నిధిని సమకూర్చుకోవచ్చు. మీ పాత అప్పులు తీర్చుకోవాలన్నా లేదా భవిష్యత్తు అవసరాల కోసం ప్లాన్ చేయాలన్నా ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 5
మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన సురక్షితమైన రాబడి కావాలనుకునే వారికి పోస్టాఫీస్ RD ఒక మేలైన ఎంపిక. నేడే మీ సమీప పోస్టాఫీసును సందర్శించి ఈ చిన్న పొదుపుతో పెద్ద ప్రయాణాన్ని ప్రారంభించండి.