Post Office Scheme: మీ మనీ డబుల్ గ్యారంటీ.. పోస్టాఫీసుల్లో సూపర్ స్కీమ్.. ఎవరైనా ఓపెన్ చేయొచ్చు..

Updated on: Apr 21, 2026 | 8:21 PM

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కొనసాగుతోంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ సంపాదించవచ్చు. కేవలం పోస్టాఫీసుల్లో మాత్రమే దీనిని ఓపెన్ చేయవచ్చు. ఎలా తెరవాలి.. లాక్ ఇన్ పీరియడ్ ఏంటి అనే వివరాలు చూద్దాం.

1 / 5
కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను దేశ ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. వీటికి కేంద్రం హామీ ఇస్తుండటంతో మీ డబ్బులకు రక్షణ కూడా ఉంటుంది. ప్రస్తుతం అనేక సేవింగ్స్ స్కీమ్ ఉండగా.. వీటిల్లో కోట్లాది మంది ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. అలాంటి వాటిల్లో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఇందులో మీరు పొదుపు చేసుకునే డబ్బులకు ఏకంగా  7.7 శాతం అత్యధిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

2 / 5
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కీ్మ్. మీరు పోస్టాఫీసుల ద్వారా మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసులకు వెళ్లి ఈ అకౌంట్ తెరవొచ్చు. కానీ మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇందులో మీరు పొదుపు చేసుకునే డబ్బులకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాత మాత్రమే మీ సొమ్మును తీసుకోవచ్చు.

3 / 5
ఈ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు ప్రతీ త్రైమాసికంలో కేంద్రం ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం 2026-27 ఆర్ధిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడ్డీ రేట్లను 7.7 శాతంగా కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. దీంతో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా మీకు ఎక్కువ ఆదాయం ఇందులో లభిస్తుంది. అంతేకాకుండా మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. దీంతో ఇందులో చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు.

4 / 5
కనీసం ఏడాదికి రూ.వెయ్యి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక గరిష్టంగా ఎంతైనా పెట్టువచ్చు. ఇక వీటిల్లో డబ్బులు పొదుపు చేసేవారికి ట్యాక్స్ మినహాయింపులు కూడా ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం,2025 ప్రకారం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.

5 / 5
ఈ పథకంలో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. అదేంటంటే.. మీరు నాలుగు సంవత్సరాల పాటు సంపాదించిన వడ్డీ ఆటోమేటిక్‌గా పథకంలో తిరిగి పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల తిరిగి పెట్టుబడి పెట్టిన వడ్డీని తాజా పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇక ఆ సంవత్సరానికి మీరు సెక్షన్ 123 కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఐదో సంవత్సరంలో వచ్చిన వడ్డీ తిరిగి పెట్టుబడి పెట్టడానికి కుదరదు.

Follow Us