హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించేందుకు పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా..? ఇలా చేస్తే నష్టపోయినట్లే..

Updated on: Nov 19, 2026 | 3:08 PM

హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా.. కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరు పీఎఫ్ నగదు గృహ అవసరాల కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పిస్తోంది. అయితే ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని నిబంధనలను ఈపీఎఫ్ఓ విధించింది. అవేంటి అనేది చూద్దాం.

1 / 5
పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లోని డబ్బులను ఆర్ధిక అవసరాల కోసం విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే వివిధ అవసరాల కోసం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. అయితే కారణం తెలపాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల చదువులు, మ్యారేజ్, సొంతింటి నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, ఏమైనా ప్రత్యేక పరిస్థితులు వంటి కారణాలతో పీఎఫ్ నగదును తీసుకోవచ్చు.

2 / 5
ఒక్కొ కేటగిరీ కింద విత్ డ్రా చేసుకోవాలంటే రూల్స్ డిఫరెంట్‌‌గా ఉంటాయి. వీటికి సంబంధించి కొన్ని పరిమితులను ఈపీఎఫ్‌వో విధించింది. దీంతో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విత్ డ్రా చేసుకోలేరు. ఒకవేళ మీరు హౌమ్ లోన్ ఈఎంఐ చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నా, ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా, సొంతిల్లు నిర్మాణం చేసుకోవాలన్నా కొన్ని నిబంధనల మేరకు పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకునే అవకాశముంది.

3 / 5
మీరు గృహ రుణం కారణం కింద పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మినిమం ఒక ఏడాది సర్వీస్ పీరియడ్ పూర్తి చేసి ఉండాలి. జీవితకాలంలో 5 సార్లు మాత్రమే ఈ విధానంలో విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మీ బ్యాలెన్స్‌లోని 75 శాతాన్ని మీరు ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు. అయితే మీరు పీఎఫ్ డబ్బులను తీసి హోమ్ లోన్ చెల్లించడం వల్ల మీ గృహ రుణం అసలు తగ్గుతుంది.

4 / 5
అసలు తగ్గడం వల్ల మీరు చెల్లించాల్సిన వడ్డీ కూడా తగ్గుతుంది. గృహ రుణం ముందే చెల్లించడం వల్ల నెలవారీ ఆదాయంలో కొంతమేర పొదుపు అవుతుంది. ఈ డబ్బులను పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు.  ఈఎంఐ భారంతో బాధపడుతున్నవారికి ఇది ఒక రిలీఫ్‌గా ఉపయోగపడుతుంది. అయితే మీరు పీఎఫ్ నగదు ముందే విత్ డ్రా చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఆర్ధిక భద్రత ఉండదు.

5 / 5
పీఎఫ్ బ్యాలెన్స్‌పై వచ్చే వడ్డీ, చక్రవడ్డీ మీ నిధిని మరింత పెంచుతుంది. మీరే ముందే హోమ్ లోన్ చెల్లించేందుకు విత్ డ్రా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే అధిక రాబడులు ఉండవు. దీని వల్ల మీ పదవి విరమణ నిధి తగ్గిపోతుంది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటును పీఎఫ్ రాబడితో పోల్చి చూడండి. పీఎఫ్ రాబడి కంటే తక్కువగా ఉంటే డబ్బులను పీఎఫ్ ఖాతాలోనే ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us