Pan Card: పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇప్పటినుంచి ఏయే సమయాల్లో అవసరం అంటే..?

Updated on: Apr 21, 2026 | 9:08 PM

పాన్ కార్డు అనేది దేశంలోనే నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఆర్ధిక వ్యవహారాలకు ఇది ఉపయోగపడుతుంది. నగదు ట్రాన్సాక్షన్లను వేగవంతంగా చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇటీవల పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు కూడా చోటుచేసుకున్నాయి.

1 / 5
దేశంలో అర్దిక కార్యకాలాపాలు నిర్వహించేందుకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేకపోతే ఆర్దిక లావాదేవీలు చేయలేము. అయితే ఇటీవల పాన్ కార్డు రూల్స్‌లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అనేక మార్పులు చేసింది. పలు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కొన్ని మినహాయింపులతో పాటు కఠిన నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. అయితే అసలు పాన్ కార్డు ఏయే సమయాల్లో ఉపయోగపడుతుంది..? ఎందుకు మన వెంట ఉంచుకోవాలి? అనే విషయాలు చూద్దాం.

2 / 5
మీరు బైక్ లేదా కారు కొనాలన్నా లేదా విక్రయించాలన్నా పాన్ కార్డు అనేది అవసరం. ఇక బ్యాంక్ అకౌంట్ ఎక్కడైనా తెరవాలంటే ఇది తప్పనిసరి అని చెప్పవచ్చు. సేవింగ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్.. ఇలా ఏ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా పాన్ అవసరం అనేది తెలిసిందే. ఇక డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం ఉపయోగపడుతుంది.

3 / 5
ఇక మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ అవసరం ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ కావాలంటే వెరిఫికేషన్ కోసం అవసరమవుతుంది. అలాగే హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు రూ.50 వేలు దాటినా పాన్ కార్డు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. బిల్లును నగదు రూపంలో చెల్లిస్తుంటే కార్డు వివరాలు అందించాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు చెబుతున్నాయి.

4 / 5
ఇక విదేశీ కరెన్సీ కొనుగోలు చేయడానికి రూ.50 వేల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో చెల్లించాన్నా లేదా విదేశీ ప్రయాణం కోసం పాన్ కార్డు యూజ్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50 వేల కంటే ఎక్కువ యూనిట్లను కొనాలనుకుంటే ధృవీకరణ కోసం సహాయపడుతుంది. అలాగే ఇక కంపెనీ జారీ చేసే బాండ్లు, డిబెంచర్లు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది.

5 / 5
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే బాండ్లకు రూ.50 వేల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే పాన్ కార్డు సబ్మిట్ చేయాలి. ఇక బ్యాంకుల్లో రూ.50 వేలకు మంచి నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ అవసరం. అలాగే బ్యాంక్ డ్రాఫ్ట్స్, పేఆర్డర్లు రూ.50 వేలకు మించి చేసే ట్రాన్సాక్షన్లకు కూడా పాన్ అందించాల్సి ఉంటుంది. ఇలా పాన్ కార్డు అనేది ఆర్దిక లావాదేవీలు సురక్షితంగా చేయడంలో సహాయపడుతుంది.

Follow Us