Credit Card: నో కాస్ట్ ఈఎంఐలో వస్తువులు కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోవడం గ్యారంటీ..

Updated on: Jun 13, 2026 | 3:25 PM

ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో చాలామంది క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ రూపంలో వస్తవులు కొనుగోలు చేస్తుంటారు. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చూసి వెంటనే కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు కొనుగోలు చేసేముందు ఒకసారి నిబంధనల గురించి తెలుసుకోండి. ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర రుసుం గురించి తెలుసుకోండి.

1 / 5
క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోతోంది. ఆఫర్లు, డిస్కౌ్ంట్స్ కోసం చాలామంది వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లకు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. దీంతో చాలామంది ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఆఫర్ల కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.

2 / 5
అయితే ఈ-కామర్స్ వెబ్ సైట్లలో క్రెడిట్ కార్డు ఉపయోగించి ఎక్కువమంది ఈఎంఐ రూపంలో టీవీ, ఏసీలు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ లాంటివి కొనుగోలు చేస్తుటారు. ఇలాంటివారి కోసం నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను సంస్థలు తీసుకొస్తున్నాయి. అంటే ఈఎంఐ పెట్టుకున్నందుకు ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీ, వడ్డీ లాంటివి వసూలు చేయరు

3 / 5
సాధారణంగా ఈఎంఐ చెల్లింపులకు ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ, జీఎస్టీ లాంటివి వసూలు చేస్తారు. అలాగే ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే అధిక వడ్డీ, ఛార్జీలు ఉంటాయి. అలాగే గడవు కంటే ముందు మొత్తం ఈఎంఐ చెల్లించాలనుకుంటే ప్రీ క్లోజర్, ఫోర్ క్లోజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ, జప్తు ఛార్జీలపై జీఎస్టీ కూడా వర్తిస్తుంది. దీని వల్ల మీ ఖర్చు అనేది పెరుగుతుంది.

4 / 5
మీరు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకునే ముందు అన్నీ వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి. ఈఎంఐ నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ రేట్లు, ఫోర్ క్లోజర్ ఛార్జీలను చెక్ చేయండి. క్రెడిట్ కార్డులపై ఆఫర్ ఉన్నప్పుడు అది నిజంగా మీకు ఉపయోగపడుతుందా.. లేదా అనేది పరిశీలించండి. మీ ఆదాయం, బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటేనే ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోవాలి.

5 / 5
క్రెడిట్ కార్డుపై భారీ డిస్కౌంట్స్ వస్తుందని కొంతమంది అవసరం లేకపోయినా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. తొందరపాటులో కొనుగోలు చేయడం మానుకోండి. ఏదైనా కొనుగోలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. నో కాస్ట్ ఈఎంఐ మాయలో పడి వెంటనే ఏదీ కొనుగోలు చేయకండి.

Follow Us